బ్రష్ చేయకుండా నీళ్లు తాగుతున్నారా ?
ఉదయం బ్రష్ చేయకుండా వాటర్ తాగడం వల్ల బరువు తగ్గుతారు. శరీరంలో జీవక్రియ రేటు పెరుగుతుంది.
By: Tupaki Desk | 14 May 2024 11:30 PM GMTఉదయం నిద్రలేచిన వెంటనే చాలా మంది బ్రష్ చేసుకున్న తరువాతనే తమ ఇతర దైనందిన కార్యక్రమాలు మొదలుపె డుతారు. అయితే బ్రష్ చేయడానికి ముందు వాటర్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నా యని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం నుంచి ఆరోగ్య నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ ఉదయం నిద్రలేచిన వెంటనే నీటిని తాగాలని సూచిస్తు న్నారు.
ఉదయం బ్రష్ చేయకుండా వాటర్ తాగడం వల్ల బరువు తగ్గుతారు. శరీరంలో జీవక్రియ రేటు పెరుగుతుంది. కేలరీలను బర్న్ చేయడంలో సాయపడుతుంది. ఒక వ్యక్తి ఆకలిని అదుపులో ఉంచుతుంది. దీనివల్ల ఎక్కువగా తినకుండా ఉంటారు. ఊబకాయం బారిన పడకుండా ఉంటారు. హై బీపీ, హై షుగర్, బ్లడ్ షుగర్ సమస్యలను నియంత్రించవచ్చు. నిద్ర లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం ఉత్తమం.
పళ్లు తోమకుండా నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఎసిడిటీ, మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు నయమవుతాయి. నోటి దుర్వాసన, నోటిలో ఉండే బ్యాక్టీరియా పోతుంది. ఆరోగ్యం చురుకుగా ఉంటుంది. అలసట తొలగిపోతుంది. చేసే పనిపై ధ్యాప పెడుతారు. అయితే ఒక వ్యక్తి బ్రష్ చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాల వరకు తినడం కానీ, తాగడం కానీ చేయడం మానుకోవాలి అని సూచిస్తున్నారు.