Begin typing your search above and press return to search.

సహజసిద్ధంగా ఒంటిని డిటాక్స్ చేద్దామా?

ఎంత తిండి అయితే మాత్రం అవసరానికి మించి పొట్టలో వేయటం వల్ల వచ్చే ప్రయోజనం కంటే.. కలిగే కష్టం ఎక్కువ.

By:  Tupaki Desk   |   18 Oct 2024 7:30 AM GMT
సహజసిద్ధంగా ఒంటిని డిటాక్స్ చేద్దామా?
X

చాలామంది పొట్టను డస్ట్ బిన్ గా భావిస్తుంటారు. ఈ మాట చదివినంతనే ఎవరు అలా చేస్తారు? అన్న సందేహం రావొచ్చు. ఆ మాటకు వస్తే.. మనలో చాలామంది తెలీకుండానే కడుపును చెత్త బుట్టగా మార్చేయటం చేస్తుంటాం. ఇంట్లో మిగిలిన ఆహారాన్ని వేస్టు చేయొద్దన్న ఉద్దేశంతో పొట్టలోకి వేసేస్తాం. ఎంత తిండి అయితే మాత్రం అవసరానికి మించి పొట్టలో వేయటం వల్ల వచ్చే ప్రయోజనం కంటే.. కలిగే కష్టం ఎక్కువ. చాలామంది ఎందుకు వేస్ట్ చేస్తావు.. కాస్త పొట్టలో వేసేయ్.. అంటూ ఆకలి కాకున్నా.. అప్పటికే తిని ఉన్నా వేసేస్తుంటారు. ఇలా తినేయటం వల్ల వచ్చే కేలరీలు.. బరువు పెరగటం లాంటివి కొన్ని సమస్యలు అయితే.. మరికొన్ని శరీరంలో వ్యర్థాల్ని పేరుకునేలా చేస్తాయి.

ఈ కారణంగా బరువు పెరగటమే కాదు.. చర్మాన్ని నిర్జీవంగా మారుస్తాయి. ఒంటి లోపల పేరుకున్న ఈ చెత్తను బయటకు తీసుకెళితే కానీ.. ఆరోగ్యంగా ఉండేది. మరేం చేయాలి? అంటే.. సింఫుల్ గా రెండు పద్దతులతో సహజ సిద్ధంగా ఒంట్లోని డిటాక్స్ ను బయటకు పంపేసే వీలుంది. దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఒక గ్లాస్ నీళ్లతోనే ఇదంతా చేసేయొచ్చు. కానీ.. దానికి ముందు చేయాల్సినవి కొంత ఉంది అదేమంటే..

విధానం 1

మూత ఉన్న గాజు సీసాలోకి లీటరు నీళ్లను నింపాలి.. అందులో పలుచగా చక్రాలుగా కోసిన ఐదు కీర దోస ముక్కల్ని అందులో వేయాలి. ఆపై రెండు పుదీన ఆకులు.. ఒక నిమ్మకాయ స్లైసు.. చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి.. నాలుగైదు గంటలైనా నాననివ్వాలి.

ఒకవేళ.. మరికొంత టైం ఎక్కువగా ఉండాలంట.. దాన్ని తీసుకొని ఫ్రిజ్ లో పెట్టండి. రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచి ఉదయాన్నే తాగేస్తే.. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లే వీలుంది. డీహైడ్రేషన్ సమస్యను కంట్రోల్ చేస్తుంది. అన్నింటికి మించి ఆ నీళ్లు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. రక్తపోటు.. షుగర్ ను కంట్రోల్ చేసేందుకు సాయం చేస్తుందని చెబుతున్నారు. ఒకవేళ మీకు కీరదోస లాంటివి నచ్చనవి ఉన్నప్పుడు వేరే ఆప్షన్ లేదా? అంటే ఉందనే చెప్పాలి.

బత్తాయిని సన్నటి చక్రాల మాదిరి తరిగి చల్లటి నీళ్లలో వేయాలి. దానిలో చిన్న అల్లంముక్క.. నాలుగు తులసి ఆకులు వేసి.. నాలుగైదు గంటల నాననివ్వాలి. ఈ నీళ్లు శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి. బత్తాయిలోని సీ విటమిన్... అల్లం జీర్ణశక్తిని పెంచుతుంది. ఈ మిశ్రమంలోని జింక్. కాల్షియం లాంటి ఖనిజాలు మరింత ఎన్జటిక్ గా ఉండేందుకు సాయం చేస్తుంది. తులసిలోని యాంటీఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. మొత్తంగా ఒంటిని మనకు మనే శుద్ధి చేసుకునే అవకాశం ఈ సింఫుల్ పద్దతులతో సాధ్యమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఒకసారి ట్రై చేయండి.