పచ్చి మిర్చీ నీళ్లు తాగితే ...
మరి పచ్చి మిర్చీని నీళ్లలో నానబెట్టుకుని తాగటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా ?
By: Tupaki Desk | 2 May 2024 7:30 AM GMTపచ్చి మిరపకాయలు. నాకు తెలిసి ఇది లేకుండా ఇంట్లో పూటగడవడం అసాధ్యం అనే చెప్పాలి. ధర ఎంత భారీగా ఉన్నా ఆఖరుకు పావు కిలో పచ్చి మిర్చి అయినా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాం. ప్రతి వంటకంలో దానిని వాడుకుంటాం. పచ్చి మిర్చీ చట్నీ కూడా ఎంతో రుచికరంగా ఉంటుేంది. మరి పచ్చి మిర్చీని నీళ్లలో నానబెట్టుకుని తాగటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా ?
పచ్చి మిర్చీని నీళ్లలో నానబెట్టి ఆ నీటిని సేవించడం మూలంగా అనేక ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభించడమే కాకుండా చర్మ ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. దీనిలో విటమిన్ సి సమృద్దిగా లభిస్తుంది. ఇందులో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది వైరస్ లు, ఇతర వ్యాధుల నుండి కాపాడతాయి. బరువు తగ్గడం, జీర్ణశక్తి, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచడానికి, కొవ్వు స్థాయిని తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
రోజూ రాత్రి పడుకునే ముందు 3 లేదా 4 పచ్చి మిరపకాయలను కడిగి వాటిని మధ్యలో చీల్చాలి. ఈ మిరపకాయలను ఒక గ్లాసు నీటిలో వేసి ఉదయం లేవగానే తాగాలి. ఈ నీళ్లు తాగడానికి ముందు, తరువాత కొంత సేపటి వరకు ఏమీ తినకూడదు. తాగకూడదు. ఇక మీరు కొద్ది రోజులు ఈ నీళ్లను తాగి చూడండి. ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో స్వయంగా మీకే అర్ధం అవుతుంది.