Begin typing your search above and press return to search.

బీ అలెర్ట్‌.. హైద‌రాబాద్‌లో కొత్త వైర‌స్ క‌ల‌క‌లం.. ల‌క్ష‌ణాలు ఇవే..!

మాన‌వాళిపై ర‌క‌ర‌కాల వైర‌స్‌ల ఎటాక్ ఇటీవ‌ల కాలంలో బాగా ఎక్కువైంది. ఎప్పుడు ఎటునుంచి ఏ వైర‌స్ రూపంలో మ‌నుష్యుల మీద ఎటాక్ జ‌రుగుతుందో తెలియ‌ని పరిస్థితి.

By:  Tupaki Desk   |   31 Jan 2025 12:18 PM GMT
బీ అలెర్ట్‌.. హైద‌రాబాద్‌లో కొత్త వైర‌స్ క‌ల‌క‌లం.. ల‌క్ష‌ణాలు ఇవే..!
X

మాన‌వాళిపై ర‌క‌ర‌కాల వైర‌స్‌ల ఎటాక్ ఇటీవ‌ల కాలంలో బాగా ఎక్కువైంది. ఎప్పుడు ఎటునుంచి ఏ వైర‌స్ రూపంలో మ‌నుష్యుల మీద ఎటాక్ జ‌రుగుతుందో తెలియ‌ని పరిస్థితి. క‌రోనా ఎఫెక్ట్‌తో రెండేళ్ల పాటు ప్ర‌పంచం ఎలా అత‌లాకుత‌లం అయ్యిందో చూశాం. క‌రోనా త‌ర్వాత ఎప్ప‌టిక‌ప్పుడే ఏదో ఒక వైర‌స్ రావ‌డం.. కొద్ది రోజులు ప్ర‌జ‌ల్లో తీవ్ర క‌ల‌క‌లం రేగ‌డం చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంలోనే తాజాగా జీబీఎస్ ( గులియ‌న్ బారే సిండ్రోమ్‌) వైర‌స్ అల‌జ‌డం మొద‌లైంది. మ‌హారాష్ట్ర‌లోని సోలాపూర్ జిల్లాలో ఈ వైర‌స్ కార‌ణంగా ఓ వ్య‌క్తి మృతిచెందారు.

ప్ర‌స్తుతం ఈ వ్యాధితో 100 మందికి పైగా బాధ‌ప‌డుతున్నారు. బ్యాక్టీరియా, వైర‌ల్ ఇన్‌పెక్ష‌న్ కార‌ణంగా బ‌ల‌హీనంగా ఉన్న వారు ఈ వైర‌స్ భారీన ప‌డుతున్నారు. మ‌హారాష్ట్రలో తీవ్ర క‌ల‌క‌లం రేపిన జీబీఎస్ వైర‌స్ ఇప్పుడు తెలంగాణ‌కు కూడా పాకేసింది. ఇది హైద‌రాబాద్‌కు కూడా విస్త‌రించేసింది. సిద్ధిపేట జిల్లాకు చెందిన మ‌హిళ జీబీఎస్ ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్టు వైద్యులు ప్రాథ‌మికంగా గుర్తించారు. స‌ద‌రు మ‌హిళ ఇప్పుడు కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది.

హైద‌రాబాద్‌లోనూ ఈ వైర‌స్ వ్యాప్తి చెంద‌డంతో న‌గ‌ర ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డుతున్నారు. అయితే వైద్యులు మాత్రం ఇది అంటు వ్యాధి కాద‌ని చెపుతున్నా కొంద‌రిలో మాత్రం అపోహ‌లు, అప న‌మ్మ‌కాలు అలాగే ఉంటున్నాయి. దీనికి చికిత్స చాలా ఖ‌రీదైంద‌ని.. ఈ వ్యాధి నివార‌ణ‌కు ఇచ్చే ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్ష‌న్ ధ‌ర ఒక్కొక్క‌టి వేల‌ల్లోనే ఉంటుందంటున్నారు.

ఇక ఈ వ్యాధి సోకిన వారిలో ఈ మార్పులు క‌నిపిస్తాయ‌ట‌.. ఒళ్లంతా తిమ్మిరిగా ఉండ‌డం.. కండ‌రాలు బ‌ల‌హీనంగా మార‌డంతో పాటు.. వాంతులు.. వికారం.. జ్వ‌రం, త‌ల‌నొప్పి.. క‌డుపు నొప్పి.. జ‌లుబుతో పాటు శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు, విరోచ‌నాలు కూడా క‌లుగుతాయ‌ట‌. ఈ వ్యాధి భారీన ప‌డ‌కుండా ఉండాలంటే రోగ నిరోధ‌క శ‌క్తి ఎక్కువుగా ఉండాలి.. ఒక వేళ ఈ వ్యాధి భారీన ప‌డితే న‌రాల‌పై ప్ర‌భావంతో నరాలు దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉందంటున్నారు.