బిపి మాయం చేసే చిట్కా.. ఇలా తింటే రోగం దూరం..
సైన్స్ ను ఉపయోగించి ఈ టెస్ట్ బర్డ్ స్పూన్ ను తయారు చేసింది జపాన్ కంపెనీ. ఇది బ్యాటరీతో పని చేస్తుంది. ఇందులో నాలుగు రకాల సెట్టింగ్లు ఉంటాయి.
By: Tupaki Desk | 18 Jan 2025 9:57 AM GMTప్రపంచవ్యాప్తంగా బీపీ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కోట్లాదిమంది బీపి బారిన పడే ఇబ్బందులు పడుతున్నారు. బిపి బారిన పడేందుకు ఉప్పు అతిపెద్ద కారణంగా ఉంటుంది. ఉప్పు లేకుండా వంటలు తినలేని పరిస్థితి నెలకొంది. సాల్ట్ ఎక్కువగా ఉంటే బీపీ పెరుగుతుంది. ఉప్పులో ఎక్కువగా ఉండే సోడియం శరీరంపై చూపించే ప్రభావం ప్రాణాల మీదకు కూడా తీసుకువస్తుందని నిపుణులు చెబుతుంటారు.
దీనికి తోడు కొత్తగా మార్కెట్లోకి రకరకాల పేర్లతో కంపెనీలు సాల్ట్ ప్యాకెట్లు తీసుకువస్తున్నాయి. ఇటువంటి వాటితో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఉప్పు మోతాదుకు మించితే అనేక అనర్ధాలకు దారితీస్తుంది. రోజు ఐదు గ్రాములు వరకు ఉప్పు తినడం శ్రేయస్కరం. అంతకుమించితే అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ భారతీయుల్లో ఎంతోమంది పది గ్రాములు వరకు ఉప్పును రోజువారి తీసుకుంటున్నట్లు అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీనివల్ల అనేక సమస్యలు వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
ముందుగా బ్లడ్ ప్రెజర్ పెరుగుతోంది. కడుపులో క్యాన్సర్లు, గుండె జబ్బులు, ఒబేసిటీ, మహిళల్లో అధిక ఉప్పు తీసుకోవడం వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నట్లు చెబుతున్నారు. బిపి వచ్చిందంటే వైద్యులు కూడా ఉప్పు తగ్గించాలని సూచిస్తుంటారు. ఉప్పు లేకుండా తినడం చాలామంది అలవాటు చేసుకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి. దీంతో డాక్టర్లు చెప్పిన మాటను చాలామంది విస్మరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల దేశంలో బీపీ రోగుల సంఖ్య పెరుగుతుంది. అయితే ఈ సమస్యకు జపాన్ కు చెందిన ఒక సంస్థ పరిష్కారాన్ని చూపించింది.
క్లాస్ వేగాస్ లో జరుగుతున్న కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో కొత్త రకం స్పూన్ ను సదరు కంపెనీ విడుదల చేసింది. డేటా కన్జ్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త ఆవిష్కరణలకు ఒక వేదికను ఏర్పాటు చేస్తుంది. అదే సిఈఎస్. కిరన్ అనే జపాన్ కంపెనీ ఈ టెస్ట్ బర్డ్స్ స్పూన్ ను తయారుచేసింది. వీక్ ఎలక్ట్రిక్ వేవ్స్ ద్వారా ఈ స్పూన్ నాలుకకు మనం తినే ఆహారంలో ఉప్పు ఉన్నట్లుగా ఒక భావనను కల్పిస్తుంది. అసలు ఉప్పు వేయని వంటకాలు తిన్న, చక్కెరను తిన్న మనం ఉప్పుతో కూడిన రుచికరమైన వంటకాన్ని తిన్న సంతృప్తిని కలిగిస్తుంది. వీటిని సూక్ష్మస్థాయిలో ఎలక్ట్రిక్ తరంగాలకు గురి చేయడం ద్వారా ఉప్పు రుచి నాలుకకు తగులుతుంది. ఇలా ఆహారంలో ఉప్పు లేకున్నా, ఒప్పో రుచితో తిన్నామన్న అనుభూతిని కలిగించి ఉప్పువైపు ఆలోచన లేకుండా చేస్తుందని ఈ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
సైన్స్ ను ఉపయోగించి ఈ టెస్ట్ బర్డ్ స్పూన్ ను తయారు చేసింది జపాన్ కంపెనీ. ఇది బ్యాటరీతో పని చేస్తుంది. ఇందులో నాలుగు రకాల సెట్టింగ్లు ఉంటాయి. అభిరుచిక తగ్గట్టు ఎంత ఉప్పు జనాలనుకుంటే ఆ సెట్టింగ్ లో పెట్టుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని జపాన్ డాక్టర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇది ఉపయోగించడం వల్ల ఉప్పులేని వంటకాలు తిని ఆరోగ్యంగా తయారయ్యేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భారతీయ మార్కెట్లో ఇంకా విడుదల అవ్వడానికి రెండు మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే జపాన్, అమెరికా మార్కెట్లో వచ్చేనెల విడుదల చేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఈ టెస్ట్ బర్డ్స్ స్పూన్ ధర ఇండియా కరెన్సీలో రూ.10000 రూపాయలు. బీపీతో బాధపడే ఎంతోమందికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడెప్పుడు మార్కెట్లలోకి అందుబాటులోకి వస్తుందని చాలామంది ఆసక్తిగా దీని గురించి తెలిసిన తర్వాత ఎదురుచూస్తున్నారు.