Begin typing your search above and press return to search.

దీర్ఘకాలం సెక్స్ కి దూరంగా ఉంటున్నారా?... ఇది మీ కోసమే!

అయితే... శృంగారానికి సుధీర్ఘకాలం దూరమైతే మాత్రం పలు సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు

By:  Tupaki Desk   |   15 Jun 2024 1:30 AM GMT
దీర్ఘకాలం సెక్స్ కి దూరంగా ఉంటున్నారా?... ఇది మీ కోసమే!
X

శృంగారానికి, ఆరోగ్యానికి, అనుబంధానికీ.. అవినాభావ సంబంధం ఉందని అంటారు. రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనడం వల్ల ఆరోగ్యంతో పాటు జీవితంలో అనుబంధం పెరుగుతుందని చెబుతుంటారు. అయితే... అనేకరకాల కారణాల వల్ల మహిళల్లో ఈ ఆసక్తి తగ్గిపోతుంటుందని, ఇతర సమస్యలను దీనికి ముడిపెట్టి మరికొంతమంది తగ్గించేసుకుంటారని అంటుంటారు.

అయితే... శృంగారానికి సుధీర్ఘకాలం దూరమైతే మాత్రం పలు సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు! ఇదే సమయంలో పలు కారణాలవల్ల ఈ విషయంపై ఆసక్తి తగ్గుతుంటే పాటించాల్సిన పలు చిట్కాలూ చెబుతున్నారు. అప్పటికీ సమస్య పరిష్కారం కానిపక్షంలో సంబంధిత నిపుణులను సంప్రదించడం బెటరని అంటున్నారు.

అవును... దీర్ఘకాలం పాటు శృంగరానికి దూరమవ్వడం వల్ల వెజైన్ ఆరోగ్యం దెబ్బతిని.. కాలక్రమేణా ఇది వైజెనల్ ఇంఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉంటుందని అంటున్నారు నిపుణులు. రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనకపోవడం వల్ల వ్యక్తిగత భాగాలకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదని.. ఫలితంగా వెజైనా పొడిబారిపోతుందని చెబుతున్నారు.

ఇదే క్రమంలో దీర్ఘకాలం సెక్స్ కి దూరంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల వ్యాదులను ఎదుర్కొనే సామర్థ్యం క్రమంగా తగ్గుతుందని చెబుతున్నారు! తక్కువలో తక్కువ వారంలో కనీసం రెండుసార్లు శృంగారంలో పాల్గొనే వారిలో ఎక్కువ మొత్తంలో కొన్ని రకాల యాంటీ బాడీలు నిడుదలైనట్లు అధ్యయనాల్లో రుజువైందని చెబుతున్నారు!

ఇలా శృంగారానికి దూరంగా ఉండటం వల్ల పైన చెప్పుకున్న శారీరక సమస్యలే కాకుండా మానసిక సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు! స్ట్రెస్ బస్టర్ గా పేర్కొనే శృంగారానికి దూరంగా ఉండటం వల్ల మానసిక ప్రశాంతత దురమవుతుందని చెబుతున్నారు. సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఎండార్ఫిన్లు విడుదలవ్వడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు.

కోరికలు పెరిగే చిట్కాలు!:

శృంగారానికి దూరంగా ఉండటానికి కారణాలు ఏమైనప్పటికీ కొన్ని చిట్కాలు పాటించడం వల్ల తిరిగి ఆ కోరికలు పెరిగే అవకాశాలున్నాయని అంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా... దంపతులిద్దరు కాసేపైనా ఏకాంతంగా గడిపేలా ప్లాన్ చేసుకోవాలని.. ఈ సమయంలో శృంగారంలో తమ తమ ప్యాంటసీలను ఒకరితో ఒకరు షేర్ చేసుకోవాలని చెబుతున్నారు.

ఇదే సమయంలో ఇద్దరూ కలిసి కపుల్ వ్యాయామాలు చేయడం.. ఒత్తిడిని దూరం చేసుకునే విషయంలో సహకరించుకోవడం చేయాలని.. అప్పుడప్పుడూ వెకేషన్ కు వెళ్లాలని.. ఇలా చేయడం కచ్చితంగా వర్కవుట్ అవుతుందని అంటున్నారు. ఇదే సమయంలో... లైంగిక కోరికల్ని పెంచే డార్క్ చాక్లెట్, అరటి పండ్లు, అవకాడో వంటివి మెనూలో చేర్చుకోవాలని చెబుతున్నారు.