Begin typing your search above and press return to search.

ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉండాలి అంటే వీటిని మీ డైట్ లో భాగంగా మార్చుకోండి..

ప్రస్తుతం ఉన్న హడావిడి జీవనశైలి కారణంగా రోగాలు ఎక్కువైపోతున్నాయి. మనమున్న పరిస్థితుల్లో ఎప్పుడు ఎలాంటి రోగాలు మనల్ని అటాక్ చేస్తాయో కూడా తెలియడం లేదు.

By:  Tupaki Desk   |   25 Sep 2024 10:30 PM GMT
ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉండాలి అంటే వీటిని మీ డైట్ లో భాగంగా మార్చుకోండి..
X

ప్రస్తుతం ఉన్న హడావిడి జీవనశైలి కారణంగా రోగాలు ఎక్కువైపోతున్నాయి. మనమున్న పరిస్థితుల్లో ఎప్పుడు ఎలాంటి రోగాలు మనల్ని అటాక్ చేస్తాయో కూడా తెలియడం లేదు. మనం తీసుకునే ఆహారంలో ఎటువంటి పౌష్టి పదార్థాలు లేకపోవడం దీనికి ప్రధాన కారణం. ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఆహారంలో కొన్ని మార్పులను చేసుకోవాలి. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు.. బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్స్ వంటి వాటి నుంచి తట్టుకునే శక్తిని అందిస్తుంది. మరి మనం తీసుకోవలసిన ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం..

బాదం:

ప్రతిరోజు బాదం పప్పులు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇది మన శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్ తో పాటు ఇతర పోషక విలువలను కూడా అందిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి అందించే బాదంపప్పులలో విటమిన్ ఇ, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్,ఫోలేట్, మెగ్నీషియం, జింక్, కాపర్ వంటి పోషకాలు మెండుగా లభిస్తాయి.

అల్లం:

మనం రోజు వంటల్లో ఉపయోగించే అల్లం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో సహజంగా లభించే యాంటీ ఆక్సిడెంట్లు మన యూనియన్ వ్యవస్థను పటిష్టంగా ఉంచుతాయి. ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడుతాయి. అల్లాన్ని మనం టీ దగ్గర నుంచి సలాడ్స్ వరకు ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. కొంతమంది తేనెలో ఊరబెట్టిన పచ్చి అల్లాన్ని తినడానికి ఇష్టపడతారు.

నిమ్మకాయ:

విటమిన్ సి అధికంగా కలిగిన నిమ్మకాయ శరీరానికి ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తుంది. రోజుకు కనీసం ఒక నిమ్మకాయ రసాన్ని అయినా మనం తీసుకోవాలి. షర్బత్ దగ్గర నుంచి మజ్జిగ వరకు ఎందులో అయినా ఈ నిమ్మకాయను కలుపుకొని తీసుకొనవచ్చు. ఇది రోగ నిరోధక శక్తి పెంచడంతోపాటు అధిక బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

వెల్లుల్లి:

ఘాటైన వాసనతో ఉండే వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది మన శరీరంలో అధిక కోపము తగ్గించడంతోపాటు ఇమ్యూనిటీ పవర్ ని బాగా పెంచుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తాయి. రోజు పరగడుపున పచ్చి వెల్లుల్లి తినడం వల్ల శరీరం మృదువుగా, కోమలంగా మారుతుంది.