Begin typing your search above and press return to search.

మిమ్మల్ని హెల్దీగా, స్లిమ్ గా ఉంచడానికి పర్ఫెక్ట్.. వీగన్ డైట్..

ఈ టైప్ ఫాలో అయ్యే వాళ్ళు కేవలం మాంసాహారాన్ని మాత్రమే కాదు జంతువుల నుంచి వచ్చే పాలను కూడా తీసుకోరు.

By:  Tupaki Desk   |   6 Aug 2024 8:30 AM GMT
మిమ్మల్ని హెల్దీగా, స్లిమ్ గా ఉంచడానికి పర్ఫెక్ట్.. వీగన్ డైట్..
X

ఈ మధ్యకాలంలో జంతువులకు హాని కలిగించకుండా ఉండాలి అనేవారు ఎక్కువగా ఉన్నారు. ఈ ఫిలాసఫీ క్రమంగా పెరగడంతో చాలామంది వీగన్ డైట్‌కి మారిపోతున్నారు. కంప్లీట్ వెజిటేరియన్ డైట్‌ను వీగన్ డైట్ అని అంటారు. బరువు తగ్గడానికి కాకుండా ఈ డైట్ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలిగిస్తుంది అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ టైప్ ఫాలో అయ్యే వాళ్ళు కేవలం మాంసాహారాన్ని మాత్రమే కాదు జంతువుల నుంచి వచ్చే పాలను కూడా తీసుకోరు.

అంతేకాదు ఈ వీగన్ డైట్ ఫాలో అయ్యేవారు ‌ లెదర్ ని అసలు ఉపయోగించారు. చాలామంది ఆరోగ్యమైన జీవనశైలి గడపాలి అంటే కచ్చితంగా ఈ వీగన్ డైట్ ఫాలో అవ్వాలి అన్న అభిప్రాయానికి వస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం అందుకుంటున్న ఈ డైట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఇది మీ శరీరానికి అవసరమైన రోజువారి మాక్రోన్యూట్రియెంట్ అవసరాలను తీరుస్తుందా లేదా అన్న విషయాన్ని తెలుసుకుందాం..

బరువు నియంత్రణ:

మామూలుగా మనం బరువు తగ్గడానికి ఎంతో ప్రయత్నిస్తుంటాము కానీ చాలా సందర్భాలలో అది కుదరదు. కానీ మీరు రోజు వీగన్ డైట్ ఫాలో అయితే బరువు తగ్గడమే కాదు ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలను పొందుతారు . మొక్కల ఆధారిత ఆహారం ఎక్కువగా తీసుకునే ఈ డైట్ కారణంగా ఊబకాయం వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. సహజ సిద్ధమైన ఆహారం కాబట్టి ఇది తేలికగా జీర్ణం అవ్వడంతో పాటు శరీరానికి అవసరమైన ఫైబర్ తో పాటుగా పోషకాలను అందిస్తుంది. అనవసరంగా స్వీట్స్, జంక్ ఫుడ్ తినాలని క్రేవింగ్స్ కూడా ఈ డైట్ ఫాలో అయ్యే వారికి క్రమంగా తగ్గుతాయట.

గుండె ఆరోగ్యం:

ప్రస్తుతం మనం చాలామంది గుండె సమస్యలతో బాధపడడం చూస్తున్నాం . అయితే వీగన్ డైట్ తీసుకునే వారికి కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ చాలా తక్కువ. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు వంటివి ఎక్కువగా తీసుకునే వారికి రక్త పోటు, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు తగ్గుతాయి. వీరికి డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ.

హెల్తీ గట్

మన శరీరంలో గట్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మన ఆరోగ్యం అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎన్నో అనారోగ్య సమస్యలకు, అనవసరంగా బరువు పెరగడానికి కూడా గట్ సరిగ్గా లేకపోవడమే కారణం.వీగన్ డైట్ గట్ మైక్రోబయోటాను మెరుగుపరచడంతో పాటు మన జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను పెరగడంతో మనకు ఊబకాయం , మలబద్ధకం ,గ్యాస్ ,అల్సర్ లాంటి సమస్యలు అస్సలు రావు.