Begin typing your search above and press return to search.

మీకు 'ఇడియట్ సిండ్రోమ్' ఉందా?... ఇవే లక్షణాలు, పరిష్కారాలు!!

ఈ ఇడియట్ సిండ్రోమ్ తో బాధపడేవారు నిత్యం తీవ్ర ఆందోళనలో ఉంటారు.

By:  Tupaki Desk   |   24 Sep 2024 7:23 AM GMT
మీకు ఇడియట్ సిండ్రోమ్ ఉందా?... ఇవే లక్షణాలు, పరిష్కారాలు!!
X

ఆరోగ్యంపై జాగ్రత్త అందరికీ అవసరమే. పైగా ఈ రోజుల్లో సరికొత్త రోగాలు తెరపైకి వస్తుండటంతో పాటు.. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ లు, షుగర్ వ్యాదులతో పాటు ఎన్నో రకాల వ్యాధులు ప్రభలుతున్న పరిస్థితి. అయితే... ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండటం మంచిదే కానీ.. శృతిమించిన రియాక్షన్, సొంత వైద్యం వంటివి మాత్రం ఏమీ మంచిది కాదని చెబుతున్నారు.

అవును... ఆరోగ్యంపై శ్రద్ధ మంచి అలవాటే కానీ... ఆరోగ్యంపై ఆందోళన తెచ్చుకోవడం, తనకున్న సమస్యలపై పదే పదే ఆన్ లైన్ లో సెర్చ్ చేయడం ఏమాత్రం మంచిది కాదని చెబుతూ.. ఇలాంటి లక్షణాలను ఇడియట్ సిండ్రోమ్ గా చెప్పవచ్చని అంటున్నారు. ఈ ఇంటర్నెట్ డెరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్ స్ట్రక్షన్ ట్రీట్ మెంట్ సొండ్రోమ్ నే వైద్య పరిభాషలో సైబర్ కాండ్రియా అని కూడా అంటారు.

ఇడియట్ సిండ్రోమ్ లక్షణాలు..!:

ఈ ఇడియట్ సిండ్రోమ్ తో బాధపడేవారు నిత్యం తీవ్ర ఆందోళనలో ఉంటారు. తమకున్న చిన్నపాటి లక్షణాలకే తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నట్లు అందోళన చెందుతూ.. ఆ లక్షణాలు ఏ వ్యాధికి సంబంధించినవి, ఆ వ్యాధి లక్షణాలు ఏమిటి, ఎలాంటి వైద్యం తీసుకొవాలి అంటూ గంటల తరబడి అనవసరంగా ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తూ ఉంటారు.

ఇలా ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తున్న సమయంలో అక్కడ కనిపించే ఆందోళనకర సమాచారం మేరకో, ఏంగ్జైటీతోనో చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం జరుగుతుంటుంది. వీరికి వైద్యులు ఇచ్చే సమాచారం కంటే.. ఆన్ లైన్ లో కనిపించే ఇన్ఫర్మేషన్ పైనే ఎక్కువ నమ్మకం ఉంటుందని చెబుతుంటారు.

ఇలా ఉన్నా లేకపోయినా అనుమానంతో ఆన్ లైన్ సెర్చ్ పైనే ఆధారపడటం వల్ల జబ్బును తప్పుగా నిర్ధారించే ప్రమాదం పుష్కలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా... ఓ వ్యాధికి మరో వ్యాధి చికిత్స తీసుకునే ప్రమాదం ఉందని, దీనివల్ల మొదటికే మోసం వస్తుందని.. పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు.

ఈ సిండ్రోమ్ కి పరిష్కారాలు!:

చిన్నదైనా పెద్దదైనా ఏదైనా అనారోగ్యం సోకినట్లు అనిపిస్తే ఆన్ లైన్ సెర్చ్ కి ప్రాధాన్యత ఇవ్వకుండా.. వైద్యులను సంప్రదించాలని అనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లాలి. అసలు నాకు ఏ వ్యాధి సోకిందనే ఆందోళనతో ఆన్ లైన్ లో సెర్చ్ చేయాలనే ఆతృతను తగ్గించుకొవాలి.

ఈ తరహా ఆందోళన నుంచి బయటకు రావడానికి కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్ లను పాటించొచ్చు. దీనికోసం... ధాన్యం చేయడం, కండరాలను వదులు చేసే వ్యాయామాలు వంటివాటిని ప్రయత్నించొచ్చని చెబుతున్నారు. అన్నింటికంటే ముందుగా... ఆన్ లైన్ లో దొరికే సమాచారం అంతా నిజం కాదనే విషయాన్ని మరిచిపోకూడదు.

ఈ విషయంలో ఎంత ప్రయత్నించినా ఈ తరహా ఆందోళన తగ్గకపోతే వైద్యుణ్ని సంప్రదించాలి.