Begin typing your search above and press return to search.

కేంద్రం హై అలర్ట్.. మంకీ పాక్స్ కేసు నమోదైందా..? లేదా?

మంకీ పాక్స్ తొలి అనుమానితుడి విషయం బయటకు రావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

By:  Tupaki Desk   |   9 Sep 2024 11:15 AM GMT
కేంద్రం హై అలర్ట్.. మంకీ పాక్స్ కేసు నమోదైందా..? లేదా?
X

ప్రపంచాన్ని ఆందోళనపరుస్తూ.. ఆఫ్రికా దేశాలను కలవరపెడుతున్న మంకీ పాక్స్.. భారత్ లోకి ప్రవేశించిందా..? అనుమానిత కేసుగా మాత్రమే ప్రకటించి.. ఇంకా నిర్ధారణ మాత్రం చేయలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రాలకు హై అలర్ట్ జారీ చేసింది. ఇంతకూ ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీ పాక్స్ ను ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి (పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ)గా డిక్లేర్ చేసింది.

కేసు నమోదు కాకుంటే ఎందుకు?

మంకీ పాక్స్ తొలి అనుమానితుడి విషయం బయటకు రావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిగ్గా కొవిడ్ వ్యాప్తి సమయంలో చేసినట్లుగానే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. అయితే, అందులో దేశంలో ఇప్పటివరకు ఒక్క మంకీ పాక్స్‌ కేసు కూడా నిర్ధరణ కాలేదని చెప్పింది. రాష్ట్రాలు హై అలర్ట్ లో ఉండాలని సూచించింది. కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ వ్యూహాలను అమలు చేయాలని పేర్కొంది.

ఇంటిగ్రేటెడ్ సర్వైలైన్స్..

నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌ మంకీ పాక్స్‌ క్లస్టర్లను గుర్తించే లక్ష్యంతో ఉందని కేంద్రం రాష్ట్రాలు, యూటీలకు తెలిపింది. విదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలు చేయడాన్ని గట్టిగా ప్రస్తావించింది. మంకీ పాక్స్‌ స్క్రీనింగ్‌ మరింత వేగిరం చేసినట్లు వెల్లడించింది. అనుమానిత కేసులను పరీక్షించేందుకు ఐసీఎంఆర్‌ ఆధీనంలోని పరిశోధనాశాలల నెట్‌ వర్క్‌ను బలోపేతం చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ చెప్పింది. రాష్ట్రాలు చర్మ, ఎస్‌టీడీ వ్యాధులకు చికిత్స చేసే క్లినిక్స్‌ పై దృష్టిపెట్టాలని పేర్కొంది. వ్యాధి లక్షణాలు కనిపించిన రోగుల విషయంలో అప్రమత్తంగా కావాలని.. వ్యాధి, దాని వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రజల్లో అనవసర భయాలు పొగేట్టేలా కృషి చేయాలని కేంద్రం తన గైడె లైన్స్ లో చెప్పింది.

కాగా, మంకీ పాక్స్ ను 1958లో తొలిసారి గుర్తించారు. 1970లో మనిషికి సోకింది. అయితే, ఆఫ్రికా దేశాల్లోనే ప్రభావం ఎక్కువ. ఎందుకంటే అవి ఉష్ణ మండల దేశాలు. మరీ ముఖ్యంగా ఆఫ్రికా మారుమూల గ్రామాల్లో మంకీ పాక్స్ ప్రభావం అధికం. ఇంత జరుగుతున్నా.. ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలు, ఆరోగ్య విభాగాలు నిర్లక్ష్యం చేశాయి. అందరూ కొవిడ్ మీద ఫోకస్ పెట్టిన సమయంలో 2022లో భారీస్థాయిలో మంకీపాక్స్‌ వ్యాపించింది. అప్పటికి గాని పరిశోధనలకు నిధులు ఇవ్వడం మొదలుపెట్లేదు. మంకీ పాక్స్‌ లో క్లాడ్‌-1 (కాంగో బేసిన్‌ క్లాడ్‌), క్లాడ్‌-2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్‌) అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటిలో క్లాడ్‌-1 ఐబీ వేగంగా వ్యాపించడమే ఆందోళనకు కారణం అవుతోంది. ఇది లైంగిక సంబంధాల కారణంగా వేగంగా వ్యాపించే వేరియంట్.