కేరళలో విస్తరిస్తున్న హెచ్1ఎన్1 కేసులు
కేరళలో విష జ్వరాలు పెరుగుతున్నాయి. హెచ్ 1ఎన్1 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.
By: Tupaki Desk | 15 May 2024 5:30 PM GMTకేరళలో విష జ్వరాలు పెరుగుతున్నాయి. హెచ్ 1ఎన్1 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. అలప్పుజ జిల్లాలో ఇంతవరకు 35 హెచ్1ఎన్1 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్, మే నెలల్లోనే 9 కేసులు కనుగొన్నట్లు తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. లేకపోతే తీవ్రమైన పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదముంది.
హెచ్1ఎన్1 అంటు వ్యాధి కావడంతో ఇది త్వరగా ఇతరులకు సోకుతుంది. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని సూచిస్తున్నారు. వ్యాధి సోకిన వారు ఒంటరిగా ఉండాలని చెబుతున్నారు. మందిలో తిరిగితే ఇబ్బందులు తప్పవు. మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.
హెచ్1ఎన్1 పరీక్షలు అన్ని ఆస్పత్రుల్లో ఉచితంగా చేస్తారు. ఎలాంటి లక్షణాలు ఉన్నా తక్షణమే పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు పాటించాలని పేర్కొంటున్నారు. హెచ్ 1ఎన్ 1, బర్డ్ ఫ్లూ రెండు ఇన్ఫ్లఎంజాగా వర్గీకరించారు. బాతులు, కోళ్లు పెంచేవారు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలంటున్నారు.
ఈ ఏడాది బర్డ్ ఫ్లూ ఇంత వేగంగా వ్యాపించడంతో జిల్లాలో 60 వేల వరకు పక్షులను చంపేశారు. బర్డ్ ఫ్లూ నియంత్రణలోనే ఉందని అంటున్నారు. వ్యాధి విస్తరించకుండా సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఏదైనా అనుమానం వస్తే తక్షణమే పరీక్షించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బర్డ్ ఫ్లూ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.
అప్పుడు కరోనా ఇప్పుడు బర్డ్ ఫ్లూ ప్రజలను భయపెడుతున్నాయి. జిల్లాలో కేసులు వెలుగు చూడటంతో మాస్క్ లు ధరించి బయటకు రావాలని చెబుతున్నారు. మన అప్రమత్తతే శ్రీరామరక్ష అని సూచిస్తున్నారు. ఎవరు కూడా నిబంధనలు ఉల్లంఘించొద్దని పేర్కొన్నారు.