Begin typing your search above and press return to search.

నవ్వటమే ఆయన రోగం !

నవ్వటం ఒక భోగం.. నవ్వించటం ఒక యోగం.. నవ్వకపోవటం ఒక రోగం..అని ప్రముఖ కవి అన్నాడు.

By:  Tupaki Desk   |   4 Jun 2024 3:25 AM GMT
నవ్వటమే ఆయన రోగం !
X

నవ్వటం ఒక భోగం.. నవ్వించటం ఒక యోగం.. నవ్వకపోవటం ఒక రోగం..అని ప్రముఖ కవి అన్నాడు. కానీ ఆ నవ్వే ఆయన పాలిట శాపంగా మారింది. సంతోషంగా ఉండడం సర్వరోగాలకు మందు అని చెప్పే వైద్యులే ఇప్పుడు ఆయనకు చికిత్సనందిస్తున్నారు. 53 ఏండ్ల హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో టీవీ చూస్తూ ఒక్కసారిగా కుర్చిలోంచి కింద పడి స్పృహ కోల్పోయాడు. ఇంట్లోవాళ్లు గమనించి స్థానికంగా ఉన్న హాస్పిటల్‌కు తరలించి ప్రథమ చిక్సిత అందించగా ఆయన స్పృహలోకి రాలేదు.

అపోలో హాస్పిటల్‌లో మెరుగైన చికిత్స కోసం తరలించారు. రోగిని పరీక్షించిన వైద్యులు అరుదైన నవ్వు ప్రేరిపిత మూర్ఛగా నిర్ధారించారు. మెదడుకు రక్తప్రసరణ తగ్గిపోవటంతో ఇలాంటి సమస్యలు వస్తాయని, జ్ఞాపకశక్తిని కోల్పోయి స్పృహ లేకుండా పడిపోతారని అపోలో వైద్యులు డాక్టర్‌ సుధీర్‌ తేల్చారు.

మూర్ఛ వచ్చిన విషయం రోగికి అస్సలు గుర్తుకు ఉండదని, ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారికి సకాలంలో వైద్యం అందించేలా చూడాలని సూచించారు. ఇలాంటి నవ్వు ప్రేరేపిత మూర్ఛ వ్యాధి అరుదుగా వస్తుందని వెల్లడించారు..