కొత్త టెన్షన్.. పూణెలో 59 కేసులు.. తెరపైకి షాకింగ్ సిండ్రోమ్..!
అవును... మహారాష్ట్రలోని పూణెలో మొత్తం 59 మందికి ఓ అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీని పేరు.. గులియన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్) అని అంటున్నారు.
By: Tupaki Desk | 24 Jan 2025 4:15 AM GMTచైనా నుంచి వస్తోన్న వైరస్ లు అంటే భారతీయుల్లో తెలియని తీవ్రమైన ఆందోళన ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం చైనా వైరస్ కాదు కానీ... తీవ్రంగా ఆందోళన కలిగిస్తూ.. మహారాష్ట్రలో పలువురిని వెంటిలేటర్ పైకి పంపించింది. ఈ నేపథ్యంలో.. ఏమిటీ కొత్త సమస్య, అధికారులు ఏమంటున్నారనేది చుద్దామ్!
అవును... మహారాష్ట్రలోని పూణెలో మొత్తం 59 మందికి ఓ అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీని పేరు.. గులియన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్) అని అంటున్నారు. ఈ వ్యాధి సోకిన 59 మందిలో 12 మంది వెంటిలేటర్ పై ఉన్నారు. నగరంలో అకస్మాత్తుగా పెరుగుతున్న వీటి దర్యాప్తు కోసం ఆరోగ్యశాఖ ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది.
తాజాగా ఈ విషయాలపై స్పందించిన మహారాష్ట్ర ఆరోగ్య శాఖకు చెందిన అధికారి ఒకరు... రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 59కి పెరిగిందని.. వారిలో 38 మంది పురుషులు, 21 మంది స్త్రీలు ఉన్నారని తెలిపారు. ఈ 59 మందిలో 12 మంది రోగులు ప్రస్తుతం వెంటిలేటర్ సపోర్ట్ పై ఉన్నారని వెల్లడించారు.
ఇదే సమయంలో... బాక్టీరియా లేదా వైరస్ ఇన్ఫెక్షన్స్ సాధారణంగా జీబీఎస్ కి దారితీస్తాయని.. ఇవి ఒక వ్యక్తి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయని.. ఇది పీడియాట్రిక్, యంగ్-ఏజ్ గ్రూపులలో ప్రబలంగా ఉందని అన్నారు. అయినప్పటికీ.. ఇది అంటువ్యాధి కాదని.. మహమ్మారిగా మారదని తెలిపారు. చికిత్స తర్వాత కోలుకుంటారని అన్నారు.
ఏమిటీ గిలియన్-బారే సిండ్రోమ్..?:
గిలియన్-బారే సిండ్రోమ్ అనేది అరుదైన నాడీ సంబంధిత పరిస్థితి అని.. ఇది నరాలపై దాడి చేస్తుందని.. కొన్ని సందర్భాల్లో తిమ్మిరి లేదా పక్షవాతానికి దారి తీస్తుందని అంటున్నారు. ఈ అరుదైన వ్యాధికి కారణాలు ఖచ్చితంగా తెలీవని చెబుతున్నారు.
ఈ వ్యాధి లక్షణాల్లో.. ప్రధానంగా దృష్టిలో ఇబ్బంది, కాళ్లలో నొప్పి, రాత్రిపూట తీవ్రమైన నొప్పులు, జీర్ణక్రియ లేదా మూత్రాశయ నియంత్రణలో సమస్యలు వంటివి రావొచ్చని చెబుతున్నారు. యూఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యురోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్స్ ప్రకారం... జీబీస్ వల్ల మెదడు అసాధారణ సంకేతాలను అందుకోవచ్చు!