Begin typing your search above and press return to search.

కిడ్నీ సమస్యకు ఢిల్లీ, గుండె జబ్బులకు ముంబై ఫేమస్ అయ్యాయా..?

భారతదేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై లు ఈ విషయాల్లోనే కాకుండా జబ్బుల విషయంలోనూ టాప్ ప్లేస్ లో ఉన్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   28 Sep 2024 5:30 PM GMT
కిడ్నీ సమస్యకు  ఢిల్లీ, గుండె జబ్బులకు ముంబై ఫేమస్  అయ్యాయా..?
X

భారతదేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై లు ఈ విషయాల్లోనే కాకుండా జబ్బుల విషయంలోనూ టాప్ ప్లేస్ లో ఉన్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా... ఢిల్లీలో కిడ్నీ వ్యాధి, ముంబైలో గుండె జబ్బులు ఎక్కువవుతున్నయని చెబుతూ పలు కీలక విషయాలు వెళ్లడించింది ఏసీకేవో ఇండియా హెల్త్ ఇన్సూరెన్స్ ఇండెక్స్ 2024.

అవును... భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ ఖర్చులు బాగా పెరుగుతున్నాయని.. ఇందులో భాగంగా ఆ ఖర్చులు 14% వార్షిక రేటుతో ఉన్నాయని ఏసీకేవో ఇండియా హెల్త్ ఇన్సూరెన్స్ ఇండెక్స్ 2024 చూపిస్తుంది. ఈ సందర్భంగా... ఆసుపత్రి ఖర్చులలో 23 శాతం రుణాల ద్వారా నిధులు సమకూరుస్తున్నాయని.. దీంతో కుటుంబాలపై ఆర్థిక భారం పడుతుందని ఇండెక్స్ వెల్లడించింది.

ఇదే క్రమంలో... ఆరోగ్య సంరక్షణ ఖర్చులలో 62% జేబులో నుంచి చెల్లించబడటంతో.. మెరుగైన హెల్త్ కవరేజ్ అవసరాన్ని నివేదిక నొక్కి చెప్పింది. ఈ నేపథ్యంలోనే భారత్ లో కిడ్నీ వ్యాధికి అత్యధిక ఆరోగ్య బీమా క్లెయిం లను కలిగి ఉన్న ప్రాంతంగా ఢిల్లీ నిలిచిందని తెలిపింది. ఆ తర్వాత స్థానంలో కొచ్చి ఉందని వెల్లడించింది.

ఇలా కిడ్నీ హెల్త్ కి సంబంధించిన క్లెయిం లలో ఢిల్లీ ఎన్.సీ.ఆర్. లో అత్యధిక వాటా ఉందని చెప్పిన ఏసీకేవో ఇండియా హెల్త్ ఇన్సూరెన్స్ నివేదిక.. తర్వాత స్థానాల్లో వరుసగా కొచ్చి, సికింద్రాబాద్, బెంగళూరు, జైపూర్ లు జాతీయ సగటు కంటే ఎక్కువ క్లెయిం వాటాను కలిగి ఉన్నట్లు వెళ్లడించింది.

కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగుల సగటు వయసు 47 ఏళ్లు అని తెలిపింది. ఈ వ్యాధికి సంబంధించి దాఖలు చేసిన అతిపెద్ద బిల్లు రూ.24,73,894 అని పేర్కొంది. ఇదే సమయంలో... గుండెపోటు వంటి రక్త ప్రసరణ వ్యవస్థ రుగ్మతల విషయంలో ముంబై, కోల్ కతాలు మెట్రోల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయని తెలిపింది.

ప్రధానంగా 31-50 మధ్య వయసు గలవారిలో గుండే జబ్బులు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఇదే సమయంలో 2020-25 మధ్య క్యాన్సర్ కేసులు 13 శాతం పెరుగుతాయని నివేదిక అంచనా వేసింది.