ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
వారి ఆరోగ్యం సహకరించదు. ఇటీవల కాలంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్రాచుర్యంలోకి వచ్చింది.
By: Tupaki Desk | 20 March 2024 12:30 AM GMTఏకభుక్తం రుషులు చేస్తారు. ద్విభుక్తం ఆరోగ్యానికి మంచిదే. త్రిభుక్తం మంచిది కాదంటారు. పూర్వ కాలం నుంచే మన దేశంలో ఉపవాసాలు చేయడం ఆనవాయితీ. ఉపవాసం అంటే రోజంతా ఏమి తినకుండా ఉంటారు. అది ఆరోగ్యవంతులైతే ఉండగలరు కానీ మధుమేహం, రక్తపోటు లాంటి రోగాలు ఉన్నవారు తినకుండా ఉండలేరు. వారి ఆరోగ్యం సహకరించదు. ఇటీవల కాలంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్రాచుర్యంలోకి వచ్చింది. అంటే రోజులో దాదాపు 16 గంటలు ఏమి తినకుండా ఉండటం.
ఊబకాయం ఉన్నవారు, బరువు తగ్గాలనుకునే వారు దీనికి ఇష్టపడుతుంటారు. ఇది ఎలా చేయాలంటే రోజులో దాదాపు 16 గంటల పాటు కడుపును ఖాళీగా ఉంచాలి. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. తరువాత దీన్ని ఓ అలవాటుగా చేసుకోవచ్చు. ఈ విధానంలో టిఫిన్ మానేస్తుంటారు. ఉదయం పది గంటలకు ఏకంగా భోజనం చేయడం చేస్తుంటారు. మధ్యాహ్నం ఆకలి వేస్తే పండ్లు, గుడ్లు, దుంపల్లాంటివి తీసుకుంటారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం 10 వరకు ఏం తినకుండా 16 గంటలు పొట్టకు విశ్రాంతి ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం.
దీన్ని ప్రారంభించాలనుకుంటే మొదటి మూడు రోజులు ప్లాన్ చేసుకోండి. ఎలాంటి ఇబ్బందులు లేకపోతే వారం పాటు పాటించండి. బాగుందనుకుంటే తరువాత నెల వరకు కూడా కొనసాగించుకోవచ్చు. నీరసంగా ఉండటం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆపేయాలి. ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు లేకపోతే కొనసాగించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయని తెలుసుకోవాలి.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల గుండె జబ్బులు పెరిగే అవకాశముందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ కాలం ఈ చర్య పాటించడం వల్ల దీర్ఘకాలిక రోగాలు వచ్చే వీలుందని చెబుతున్నారు. ఇతర అనారోగ్య సమస్యలున్న వారు ఇలాంటి సాహసం చేయకపోవడమే బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెబుతున్నారు.
ఊబకాయం, అధిక బరువు సమస్యతో బాధపడే వారికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఔషధం లాంటిదని అంటున్నారు. శరీరంలో కొవ్వు స్థాయిలను కరిగించడంలో ఇది దోహదపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది. శరీరంలో కొవ్వులు కరిగించి మన ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. ఈ విధానం మన ఆరోగ్య పరిరక్షణలో చక్కని ఫలితాలు కలిగిస్తుంది. ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుందని తెలుసుకోవచ్చు.