Begin typing your search above and press return to search.

కొత్త విష‌యం: 'ఆలివ్‌'తో అలుపెరుగ‌ని శృంగారం!

కొన్ని కొన్ని విష‌యాలు మ‌న చుట్టూనే జ‌రుగుతుంటాయి. కానీ, వాటి లోతుపాతులు తెలిస్తే.. ఆశ్చ‌ర్యం వేస్తుంది.

By:  Tupaki Desk   |   28 Dec 2024 2:30 PM GMT
కొత్త విష‌యం: ఆలివ్‌తో అలుపెరుగ‌ని శృంగారం!
X

కొన్ని కొన్ని విష‌యాలు మ‌న చుట్టూనే జ‌రుగుతుంటాయి. కానీ, వాటి లోతుపాతులు తెలిస్తే.. ఆశ్చ‌ర్యం వేస్తుంది. క‌రోనాకు ప్ర‌పంచం మొత్తం కుమిలిపోయి.. క‌దిలిపోయిన క్ష‌ణంలో భార‌త దేశం వంటిల్లు చూపించింది. వంటింట్లో నిత్యం వాడుకునే తాలింపు సామాన్లు క‌రోనాకు దీటైన వైద్యంగా ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. ప‌నిచేశాయి కూడా! ఇప్పుడు ఆలివ్ నూనె వ్య‌వ‌హారం కూడా అలానే ఉంది. తాజాగా చేసిన ప‌రిశోధ‌న‌ల్లో ఆలివ్‌లో శృంగార ర‌హ‌స్యం ఒక‌టి బ‌య‌ట ప‌డింది.

నిజానికి ఆలివ్ నూనెను ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల్లో నిత్యం వంట‌ల‌కు వినియోగిస్తారు. లీట‌రు 400 నుంచి 800 రూపాయ‌ల మ‌ధ్య దొరుకుతోంది. దీనిలోనూ అనేక గ్రేడ్‌లు ఉన్నాయి. సాదార‌ణంగా కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్న‌వారు, ర‌క్త ప్ర‌సర‌ణ‌లో ఇబ్బందులు ఉన్న‌వారికి వైద్యులు కూడా ఆలివ్ నూనెను సిఫార‌సు చేస్తారు. అయితే.. ఈ ఆలివ్ నూనె ప‌ని ఇక్క‌డితోనే ముగిసిపోలేదు. తాజాగా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఏథెన్స్ విశ్వ‌విద్యాల‌యం(గ్రీస్ దేశంలో ఉంది) ఓ సంచ‌ల‌న విష‌యాన్ని తేల్చి చెప్పింది.

ఈ విశ్వ‌విద్యాల‌యం ప‌రిశోధ‌కులు ఆలివ్ నూనెపై జ‌ర‌పిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ నూనెకు శృంగారాన్ని ప్రేరే పించే అద్భుత ల‌క్ష‌ణం ఉన్న‌ట్టు గుర్తించారు. అంతేకాదు.. వీర్య క‌ణాల వృద్ధి, పురుషాంగ స్తంభ‌న‌ల‌పై కూడా ప్ర‌భావం చూపుతుంద‌ని తెలిపారు. ఆలివ్ నూనెను ఆరు మాసాల పాటు వినియోగించి.. వీర్య క‌ణా ల వృద్ధిని గుర్తించిన‌ట్టు పేర్కొన్నారు. వారానికి 8-10 టీ స్పూన్ల ఆలివ్ నూనెను తీసుకుంటే.. మేనిఛాయ తోపాటు.. శృంగార ప‌ర‌మైన కోరిక‌లు.. వీర్య వృద్ది పెరుగుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు.

అంతేకాదు.. ప‌ది వ‌యాగ్రా టాబ్లెట్లు వేసుకుంటే వ‌చ్చే శృంగార శ‌క్తి.. 5 చెంచాల ఆలివ్ నూనెకు స‌మాన‌మ ని ఏథెన్స్ ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. దీనిని అన్ని కోణాల్లోనూ పరిశోధించిన‌ట్టు వెల్ల‌డించారు. అలెపెరుగ‌ని శృంగారం కోరుకునేవారు ఆలివ్ నూనెను వినియోగించ‌డం ద్వారా స‌క్సెస్ కావొచ్చ‌ని కూడా పేర్కొన్నారు. ఇది పురుషుల్లోనే కాకుండా.. మ‌హిళ‌ల‌పైనా ప్ర‌భావం చూపుతుంద‌ని వెల్ల‌డించ‌డం విశేషం.