Begin typing your search above and press return to search.

షాకింగ్... క్వాలిటీ టెస్ట్ ఫెయిలైన పారాసిటమాల్!

చాలా మందికి పారాసిటమాల్ అనేది అత్యంత రెగ్యులర్ ట్యాబ్లెట్ అనే చెప్పాలి.

By:  Tupaki Desk   |   26 Sep 2024 4:00 AM GMT
షాకింగ్...  క్వాలిటీ టెస్ట్  ఫెయిలైన పారాసిటమాల్!
X

చాలా మందికి పారాసిటమాల్ అనేది అత్యంత రెగ్యులర్ ట్యాబ్లెట్ అనే చెప్పాలి. కాస్త జ్వరం వచ్చినా, తలబాదగా అనిపించినా, బాడీ పెయిన్స్ వచ్చినా, జలుబుగా అనిపించినా... వెంటనే పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసేసుకుంటుంటారు చాలా మంది! అయితే తాజాగా ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. పారాసిటమాల్ క్వాలిటీ టెస్ట్ లో ఫెయిలైంది!

అవును... కాల్షియం, విటమిన్ డీ 3 సప్లిమెంట్స్, యాంటీ డయాబెటిస్ మాత్రలు, అధిక రక్తపోటు మందులు సహా 50 కంటే ఎక్కువ మందులు భారతదేశ డ్రగ్స్ రెగ్యులేటర్ నాణ్యత పరీక్షలో విఫలమయినట్లు తెలుస్తోంది. కర్నాటక యాంటీబయాటిక్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ నుంచి పారాసెటమాల్ మాత్రలు కూడా న్యాణ్యత సమస్యలు ఎదుర్కొందని అంటున్నారు!

తాజాగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీ.డీ.ఎస్.సీ.ఓ).. 53 ఔషదాలను "నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ (ఎన్.ఎస్.క్యూ) హెచ్చరిక"గా ప్రకటించింది.

ఇందులో... విటమిన్ సి, డి 3 మాత్రలు షెల్కాల్, విటమిన్ సీ సాఫ్ట్ జెల్స్, విటమిన్ బీ కాంప్లెక్స్, పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ ఐపీ 500 ఎంజీ, యాంటీ యాసిడ్ పాన్-డి, యాంటీ డయాబెటిక్ డ్రగ్ గ్లిమొపిరైడ్ మొదలైన.. అత్యధికంగా అమ్ముడవుతున్న 53 మందులు డ్రగ్ రెగ్యులేటర్ ద్వారా నాణ్యత తనిఖిల్లో విఫలమయ్యాయని అంటున్నారు.

ఈ మందులను హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్, హెటెరో డ్రగ్స్, అల్కేం లేబొరేటరీస్, కర్ణాటక యాంటీబయాటిక్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ప్యూర్ & క్యూర్ హెల్త్ కేర్, మెగ్ లైఫ్ సైన్సెస్ తయారు చేస్తున్నాయని అంటున్నారు. కడుపు ఇన్ఫెక్షన్ చికిత్సకు వాడే మెట్రోనిడాజో కూడా నాణ్యత పరీక్షల్లో విఫలమైనట్లు చెబుతున్నారు.

ఇదే సమయమో... టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ ద్వారా పంపిణీ చేయబడిన, ఉత్తరాఖండ్ కు చెందిన ప్యూర్ & క్యూర్ హెల్త్ కేర్ ద్వారా తయారుచేయబడిన షెల్కాల్ కూడా పరీక్షణల్లో ఫెయిల్ అయిన వాటిలో ఒకటిగా ఉంది. కోల్ కతా డ్రగ్స్ టెస్టింగ్ ల్యాబ్ ఆల్కెం హెల్త్ సైన్స్ యాంటీబయాటిక్స్ క్లావం 625, పాన్ డీలను నకిలీగా పరిగణించినట్లు చెబుతున్నారు.