ప్రపంచ దేశాలకు హెచ్చరిక.. రాబోతున్న మరో మహమ్మారి?
ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ పేరు చెబితే ప్రపంచ దేశాలు వణికిపోతాయి
By: Tupaki Desk | 29 May 2024 5:26 AM GMTప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ పేరు చెబితే ప్రపంచ దేశాలు వణికిపోతాయి. కుటుంబాలను నాశనం చేసింది.. దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది.. ఒక్కసారిగి మనిషి ఆలోచనా విధానాన్ని కూడా మార్చేసింది ఈ మహమ్మారి అని అంటారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి మరోమహమ్మారి విషయంలో హెచ్చరికలు తెరపైకి వచ్చాయి.
అవును... కరోనా తరహాలో మరో మహమ్మారి ముంచుకొస్తుందని అంటున్నారు బ్రిటన్ ప్రభుత్వ మాజీ ప్రధాన సలహాదారు, సైంటిస్ట్ సర్ పాట్రిక్ వాలెన్స్. ఈ మేరకు తాజాగా ప్రపంచ దేశాలకు ఆయన హెచ్చరికలు జారీచేశారు. ఇదే సమయంలో... మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని అందరూ అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని.. ప్రతి ఒక్కరు దీన్ని ఎదుర్కోక తప్పదని ఆయన తెలిపారు.
తాజాగా హే ఫెస్టివల్ కు హాజరైన ఆయన.. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ప్రపంచ దేశాలన్నీ భవిష్యత్తులో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని.. మహమ్మారులను ముందుగానే గుర్తించేందుకు నిఘా వ్యవస్థ ఎంతో అప్రమత్తంగా ఉండాలని.. ఈ మేరకు ఇలాంటి ఒక నిఘా వ్యవస్థను ప్రపంచ దేశాలన్నీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఇదే క్రమంలో... "కరోనా సమయంలోలో ప్రపంచ దేశాలకు భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయి. అదే తరహాలో మరో సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అప్పటి ఇబ్బందులు మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవాలి" అని పాట్రిక్ వాలెన్స్ సూచించారు.
ఈ సందర్భంగా... రాబోయే మహమ్మారిని బలంగా ఎదుర్కొనేందుకు డయాగ్నోస్టిక్ సిస్టమ్, వ్యాక్సిన్ తో పాటు ట్రీట్ మెంట్ కు అవసరమైన ఎక్విప్మెంట్ లు అన్ని సిద్ధంగా ఉంచుకోవాలని వాలెన్స్ సూచించారు. ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా, సమన్వయంతో ముందుకెళ్తేనే మహమ్మారిని నిరోధించగలమని తెలిపారు. అవసరమైన ఎక్విపమెంట్ ఉంటేనే లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్ వంటి చర్యల అవసరం ఉండదని సూచించారు.