Begin typing your search above and press return to search.

ఒత్తిడితో గర్భస్త శిశువుకు ఇబ్బందులే?

మానవ పుట్టుక ఓ అద్భుతం. దాని రహస్యం ఎవరికి తెలియదు. అందుకే చావు పుట్టుకలు మన చేతిలో ఉండవు అంటారు

By:  Tupaki Desk   |   23 April 2024 11:30 PM GMT
ఒత్తిడితో గర్భస్త శిశువుకు ఇబ్బందులే?
X

మానవ పుట్టుక ఓ అద్భుతం. దాని రహస్యం ఎవరికి తెలియదు. అందుకే చావు పుట్టుకలు మన చేతిలో ఉండవు అంటారు. ఎలా పుడతామో తెలియదు. ఎప్పుడు చనిపోతామో కూడా తెలియదు. కానీ మధ్యలో మనిషి మనుగడ మాత్రం తెలుస్తుంది. మనిషి పుట్టుకలో ఇన్ని అద్భుతాలు దాగి ఉన్నాయని చాలా మందికి తెలుసు. కానీ వాటి రహస్యాలు మాత్రం ఎవరికి అంతిచిక్కవు.

మనిషి తొమ్మిది నెలలు తల్లి గర్భంలోనే ఉంటాడు. పిండంగా అన్ని తల్లి నుంచే స్వీకరిస్తాడు. అక్కడే మనిషి రూపురేఖలు సంతరించుకుంటాయి. అన్ని అవయవాలు కూడా ఏర్పడతాయి. మానవ పుట్టుకపై లండన్ లోని యూపీఎల్ యూనివర్సిటీ పరిశోధకులు ఓ అధ్యయనం చేసి వాటిని నేచర్ సెల్ బయాలజీ జర్నల్ లో ప్రచురించారు.

వాటి వివరాల ప్రకారం చిట్టెలుక, కప్పల అండాలపై పరిశోధనలు జరిపారు. గర్భసంచిలో ఏర్పడే ఒత్తిడి వల్ల పిండంపై ప్రభావం పడుతుందని వెల్లడించారు. గర్భసంచిలో ఒత్తిడి ఏర్పడితే సున్నితమైన గర్భస్త శిశువు రూపు రేఖలు మారిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఒత్తిడి తీవ్రమైతే వైకల్యం కూడా రావొచ్చని చెబుతున్నారు. దీంతో గర్భంతో ఉన్నప్పుడు మహిళలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

శిశువు కడుపులో పడినప్పటి నుంచి పరీక్షలు, స్కానింగులు, మందులు అంటూ మొత్తం మందులతోనే పిండం ఎదిగేలా చేస్తున్నారు. దీని వల్ల రోగనిరోధక శక్తి సన్నగిల్లుతుంది. దీంతో చిన్న వయసులోనే రోగాలు పెరుగుతున్నాయి. మధుమేహం, రక్తపోటు వంటి రోగాలు వేధిస్తున్నాయి. దీనికి కారణం మందుల ప్రభావం అని చెబుతున్నారు.

ఈనేపథ్యంలో గర్భస్త శిశువుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. గర్భంపై ఎలాంటి ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవడం వల్ల శిశువుకు మేలు కలుగుతుంది. మనం చేసే ప్రతి పని శిశువుకు రక్షణగా ఉండేలా చూసుకోవడం మంచిది. అప్పుడే శిశువుకు ఎలాంటి ఢోకా ఉండదని తెలుసుకోవాలి.