గుడ్ న్యూస్: క్యాన్సర్ కు వ్యాక్సిన్... ఎంత ఖర్చవుతందంటే..?
ప్రస్తుత కాలంలో అత్యంత భయంకరమైన, బాధాకరమైన వ్యాధి అనగానే టక్కున చెప్పే పేరు 'క్యాన్సర్' అని చెబుతారని అంటారు.
By: Tupaki Desk | 19 Dec 2024 3:57 AM GMTప్రస్తుత కాలంలో అత్యంత భయంకరమైన, బాధాకరమైన వ్యాధి అనగానే టక్కున చెప్పే పేరు 'క్యాన్సర్' అని చెబుతారని అంటారు. దాని ప్రభావాన్ని అనుభవించేవారికే ఆ సమస్య తీవ్రత, బాధ తెలుస్తాయని అంటుంటారు. ఈ సమయంలో రష్యా నుంచి ఓ గుడ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. క్యాన్సర్ కు వ్యాక్సిన్ కనుగొనబడింది!
అవును... రష్యా క్యాన్సర్ కు వ్యాక్సిన్ ను కనిపెట్టింది.ఇది ఎం.ఆర్.ఎన్.ఏ. వ్యాక్సిన్. ఈ విషయాలను టాస్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ సందర్భంగా స్పందించిన రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ అధిపతి ఆండ్రీ కప్రిన్... ఈ వ్యాక్సిన్ 2025 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు!
ఇదే సమయంలో... వ్యక్తీగతీకరించిన టీకాలు నిర్మించడానికి సమయం పడుతుందని.. ఈ విధానాలకు అరగంట నుంచి గంట సమయం పడుతుందని గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఎఫిడెమియాలజీ, మైక్రోబయాలజీ అలెగ్జాండర్ గింట్స్ బర్గ్ చెప్పారు! ఈ వ్యాక్సిన్ కణితి ఏర్పడకుండా నిరోధించడం కంటే చికిత్స చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని అంటున్నారు.
రష్యా శాస్త్రవేత్తల మునుపటి ప్రకటనల ప్రకారం.. ఈ వాక్సిన్ పాశ్చాత్య దేశాలలో అభివృద్ధి చేయబడిన వ్యాక్సిన్ ల మాదిరిగానే ఉంటుంది. అయితే... ఈ వ్యాక్సిన్ ఏ రకమైన క్యాన్సర్ కు చికిత్స చేయాలనుకుంటుంది.. దాని ప్రభావం, పంపిణీ గురించిన వివరాలు ప్రస్తుతానికి అస్పష్టంగానే ఉన్నాయి.
వాస్తవానికి రష్యాలో క్యాన్సర్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా... 2022లో 6,35,000 కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు. వీటిలో ప్రధానంగా... రొమ్ము, ఊపిరితిత్తులు, పెద్దప్రేగు క్యాన్సర్ రష్యన్ లలో సర్వసాధారణంగా నివేధించబడ్డాయని అంటున్నారు.
వాస్తవానికి సాంప్రదాయ టీకాలు వ్యాధిని నివారించడానికి వైరస్ భాగాలను ఉపయోగిస్తాయని.. అయితే, ఈ క్యాన్సర్ టీకాలు మాత్రం క్యాన్సర్ కణాల ఉపరితలం నుంచి యాంటిజెన్ లు అని పిలవబడే హానిచేయని ప్రోటీన్ లను ఉపయోగించుకుంటాయని.. ఈ యాంటిజెన్ లు క్యాన్సర్ కణాలపై దాడిచేసి, నాశనం చేసే ప్రతినిరోధకాలను తయారు చేయడానికి రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయని చెబుతున్నారు.
ఈ వ్యాక్సిన్ లను ఈ ఏడాది మే లో యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా పరిశోధకులు గ్లియోబ్లాస్టోమాతో బాధపడుతున్న నలుగురు రోగులపై వ్యక్తిగతంగా పరీక్షించారని.. ఈ ఇంజెక్షన్ చేసిన రెండు రోజుల్లోనే బలమైన రోగనిరోదక ప్రతిస్పందనను ప్రేరేపించిందని అధ్యయనం వెల్లడించిందని చెబుతున్నారు.
ఇక టాస్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం... ఈ వ్యాక్సిన్ రష్యన్ లకు ఉచితంగా పంపిణీ చేయబడుతుందని.. ఈ పంపిణీ 2025 ప్రారంభంలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఒక ఇతర స్టేట్స్ లో ఒక్కో మోతాదుకూ 3,00,000 రూబిళ్లు ($2,869 / సుమారు రూ.2,44,000) ఖర్చవుతుందని చెబుతున్నారు.