Begin typing your search above and press return to search.

ఏమిటీ స్లీప్ డివోర్స్.. దీంతో ప్యాచప్ ఎలా?

అందునా.. ఇటీవల కాలానికి చెందిన వారిలో అయితే.. ఇవన్నీ మరింత తక్కువగా ఉంటాయన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Jan 2025 4:19 AM GMT
ఏమిటీ స్లీప్ డివోర్స్.. దీంతో ప్యాచప్ ఎలా?
X

మొగుడు పెళ్లాలన్న తర్వాత మాటా మాటా పెరగటం.. తిట్టుకోవటం.. అరుచుకోవటం.. అభిప్రాయ బేధాలతో ఆవేశాలకు.. ఆవేదనలకు గురి కావటం కామన్ గా జరిగేదే. సినిమాల్లో చూపించినంత అప్యాయ.. అనురాగాలు కాస్త తక్కువే. అందునా.. ఇటీవల కాలానికి చెందిన వారిలో అయితే.. ఇవన్నీ మరింత తక్కువగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. గతానికి భిన్నంగా రిలేషన్ ను బ్రేకప్ చేసుకోవటం ఎంత సింఫుల్ గా మారిందో.. జీవిత భాగస్వామితో బంధాన్ని ఇట్టే ముగించేస్తున్న వైనాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయని చెబుతున్నారు

చిన్న విషయాలు చిలికి చిలికి గాలివానలా మారి విడిపోతున్న జంటలకు సరికొత్త మేనేజ్ మెంట్ థియరీని చెబుతున్నారు నిపుణులు. చిన్న విషయాలే తెగే వరకు వెళ్లకూడదంటే స్లీప్ డివోర్స్ బ్రహ్మండంగా పని చేస్తుందని.. విడిపోవాలనుకునే జంటల మధ్య ప్యాచప్ కు ఈ కాన్సెప్టు వర్కువుట్ అవుతుందంటున్నారు. ఇంతకూ ఈ స్లీప్ డివోర్స్ అంటే ఏమిటి? ఇందులో భాగంగా ఏం చేయాలో వివరిస్తున్నారు నిపుణులు.

అభిప్రాయ బేధాలు కానీ.. ఇతర అంశాల కారణంగా కట్టలు తెగే కోపంలో ఉన్న జీవిత భాగస్వాములు నిద్ర పోయే వేళలో వేర్వేరుగా ఉండాలని చెబుతున్నారు. దీని వల్ల మనసు కుదుట పడటంతో పాటు.. ఎదుటి వాళ్ల వెర్షన్ ను అర్థం చేసుకునే సమయం దొరుకుతుందని చెబుతున్నారు. అంతేకాదు.. చక్కటి నిద్ర మానసిక ఒత్తిడికి మంచి మందుగా చెబుతున్నారు. దీంతో.. రోజును తాజాగా స్టార్ట్ చేయటానికి సాయం చేస్తుందని చెబుతున్నారు.

దీనికి కారణం లేకపోలేదని చెబుతూ.. చాలామంది మగాళ్లు ఎంత పెద్ద గొడవైనా ఏమీ జరగనట్లుగా వ్యవహరిస్తుంటారు. కానీ.. ఆడవాళ్లు మాత్రం దేన్నీ అంత త్వరగా మర్చిపోరు. అయితే.. ఈ పద్దతి అన్నిసార్లు అంత మంచిది కాదంటున్నారు. ఈ కోపం తగ్గాలంటే ఒంటరిగా ఒక రాత్రి నిద్రపోవటమే బెటర్ గా సూచిస్తున్నారు. గొడవలయ్యాక చాలామంది బాధ పడుతూ కూర్చుంటారని.. దానికి భిన్నంగా తమ భాగస్వామి మాత్రం గుర్రు పెట్టి మరీ నిద్ర పోతుంటారని.. ఇలాంటివి నిద్రపోని భాగస్వామిలో మరింత ఒత్తిడిని.. కోపాన్నీ పెంచేస్తుందని చెబుతున్నారు. అందుకే చిన్న చిన్నకారణాలతో విడాకులు తీసుకునే కన్నా..వేర్వేరుగా పడుకోవటం ద్వారా ప్యాచప్ కు ప్రయత్నించట మంచిదని చెబుతున్నారు. ఈ తీరును మిలీనియల్స్ మస్ట్ గా ట్రై చేయటం మంచిదని.. ఇప్పుడు చాలామంది ఇదే విధానాన్ని అమలు చేస్తున్నట్లుగా పేర్కొంటున్నారు.