Begin typing your search above and press return to search.

స్మోక్ చేసే టీనేజర్స్... ఇది చదవాల్సిందే!

ఇలా ధూమపానం చేసే టీనేజర్స్ కు తోటివారి కంటే భిన్నమైన మెదడు ఉండవచ్చని తాజాగా ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది.

By:  Tupaki Desk   |   18 Aug 2023 2:30 AM GMT
స్మోక్  చేసే టీనేజర్స్... ఇది చదవాల్సిందే!
X

సాధారణంగా టీనేజ్ లో తన తోటివారి కంటే ఒక మెట్టుపైన ఉన్నాడని చూపించడానికో.. తాను స్వతంత్రంగా ఉన్నట్లు చూపించడానికో.. లేక, అమ్మాయిలను ఆకర్షించే క్రమంలోనో.. సినిమాల ప్రభావంతోనో దూమపానానికి అలవాటుపడుతుంటారని అంటుంటారు! ఈ క్రమంలో 20-30 శాతం మంది టీనేజర్లు కాలేజీలో చేరిన వెంటనే ధూమపానం చేస్తారట.

అయితే... ఇలా ధూమపానం చేసే టీనేజర్స్ కు తోటివారి కంటే భిన్నమైన మెదడు ఉండవచ్చని తాజాగా ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. అవును... యూకేలోని కేంబ్రిడ్జ్, వార్విక్ విశ్వవిద్యాలయాలు.. చైనాలోని ఫుడాన్ యూనివర్శిటీల నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం 14, 19, 23 సంవత్సరాల వయస్సు గల 800 కంటే ఎక్కువ మంది యువకుల మెదడు ఇమేజింగ్, ప్రవర్తనా డేటాను విశ్లేషించింది.

ఇందులో భాగంగా... సగటున 14 సంవత్సరాల వయస్సులో ధూమపానం ప్రారంభించిన యువకులు నిర్ణయం తీసుకోవడం, నియమాలను ఉల్లంఘించడంలో ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.

ఇదే సమయంలో పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. మెదడు ముందు ఎడమ వైపున ఉన్న ఒక నిర్దిష్ట ప్రాంతంలో తక్కువ గ్రే మ్యాటర్ వాల్యూమ్ నికోటిన్ వ్యసనం కోసం వారసత్వంగా వచ్చిన బయోమార్కర్ కావచ్చని అంటున్నారు. అదే మెదడు ప్రాంతంలోని కుడి భాగంలో ధూమపానం చేసేవారిలో బూడిదరంగు పదార్థం తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఈ పరిశోదనలో పరిశోధకులు 14 సంవత్సరాల వయస్సులో ధూమపానం చేయని వారితో మెదడు ఇమేజింగ్ డేటాను పోల్చారు. ఇదే సమయంలో 19, 23 సంవత్సరాల వయస్సులో అదే వ్యక్తుల కోసం దీనిని పునరావృతం చేశారు.

ఈ సమయంలో శాస్త్రవేత్తలు మెదడులోని కుడి వెంట్రోమీడియల్ ప్రిఫ్రంటల్ కార్టెక్స్ అని పిలువబడే ప్రాంతాన్ని చూసినప్పుడు.. 14 సంవత్సరాల వయస్సు నుండి ధూమపానం చేసిన వారు, 19 సంవత్సరాల నుండి ధూమపానం చేసేవారు ఇద్దరి కుడి ఫ్రంటల్ లోబ్‌ లో అధిక బూడిద పదార్థం కోల్పోవడం జరుగుతుందని అంటున్నారు.

ఇదే సమయంలో ధూమపానం చేసే టీనేజర్లు అపరాధం, ధిక్కరించే భావాల మధ్య చిక్కుకుంటారని చెబుతున్నారు. పాసివ్ స్మోకింగ్ మెదడు అభివృద్ధిని కూడా దెబ్బతీస్తుందని చెబుతున్నారు! ఇదే సమయంలో ధూమపానం చేసే యువకులు ఎక్కువగా చిరాకుగా ఉండటంతో పాటు.. తమను తాము ఒంటరిగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారని తేలిందంట.

సో... దూమపానం ఆరోగ్యానికి హానికరం!!