ఒక్క సిగరెట్‌తో 20 నిమిషాల ఆయుష్షు ఖతం..!
మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. అయినా తాగే వారు మానడం లేదు, కొత్తగా ఎంతో మంది తాగడం ప్రారంభిస్తున్నారు
By: Tupaki Desk | 31 Dec 2024 7:30 PM GMTమద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. అయినా తాగే వారు మానడం లేదు, కొత్తగా ఎంతో మంది తాగడం ప్రారంభిస్తున్నారు. మద్యం బాటిల్స్‌పై సిగరెట్ ప్యాకెట్స్ పై వార్నింగ్ సింబల్స్ పెట్టినా, ఫోటోలు ముద్రించిన తాగడం మాత్రం ఆపడం లేదు. క్యాన్సర్‌కి కారణం అయిన ధూమపానంకి యువత బలి అవుతున్నారు. సిగరెట్ తాగే అలవాటు ఉన్న వారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కుటుంబాలు ఛిద్రం చేస్తున్నారు. యువతలో మార్పు తీసుకు వచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఇవ్వడం లేదు.
సిగరెట్ వల్ల ఎంతటి ప్రమాదం ఉందో ఇప్పటికే ఎన్నో ప్రయోగాల ద్వారా నిరూపితం అయ్యింది. ఎన్నో రకాలుగా నిరూపించి మరీ చెప్పినా తాగడం మాత్రం ఆపడం లేదు. తాజాగా యూనివర్శిటీ ఆఫ్ లండన్ షాకింగ్ సర్వే ఫలితాన్ని వెళ్లడించింది. చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రయోగ ఫలితాన్ని గురించి యూనివర్శిటీ ఇటీవల విడుదల చేసింది. ఆ ప్రయోగ ఫలితంను బట్టి ఒక్క సిగరెట్‌ను తాగితే పురుషుల్లో 17 నిమిషాల ఆయుష్షు, స్త్రీలల్లో 22 నిమిషాల ఆయుషు తగ్గుతుంది. సగటును ఒక్క సిగరెట్ తాగితే మనిషి ఆయుషు 20 నిమిషాలు ఖతం అంటూ సదరు రిపోర్ట్‌లో పేర్కొనడం జరిగింది.
ఆషామాషీగా చేసిన సర్వే కాదు, కొన్ని వేల మందిని పరిశీలించిన తర్వాత, వందల మంది వైద్యులను సంప్రదించిన తర్వాత ఈ రిపోర్ట్‌ను తయారు చేశారు. ఒక్క సిగరెట్ తాగితే ఏం అవుతుంది అనుకుంటే కచ్చితంగా చాలా పెద్ద నష్టం భవిష్యత్తులో జరుగుతుందని ఈ సర్వే ఫలితాన్ని బట్టి అర్థం అవుతుంది. ప్రతి సిగరెట్ తాగే వారికి ఈ రిపోర్ట్ చెంప పెట్టులా పని చేయాల్సిన అవసరం ఉంది. వారి కుటుంబాల గురించి పట్టించుకోకుండా, వారి కోసమే జీవితం సాగించే వారి గురించి పట్టించుకోకుండా తాము అలాగే సిగరెట్ తాగుతాం అనుకునే వారు ఇకపై అయినా జాగ్రత్త పడితే మంచింది. లేదంటే సొంత వారికి లేకుండా పోతారు.
కుటుంబ సభ్యులతో ఉన్న సమయంలో సిగరెట్ తాగడం అనేది మరింత చేటును కలిగిస్తుంది. పీల్చి వదిలిన పొగ అనేది ఇతరులు పీల్చడం ద్వారా సగం సిగరెట్ తాగినట్లు అంటూ ఆ మధ్య ఒక సర్వే రిపోర్ట్ చెప్పింది. కనుక అవతలి వారు సిగరెట్ తాగకున్నా పక్కన ఉంటే కనీసం 10 నిమిషాల ఆయుష్షు తగ్గినట్లే. కనుక మీ జీవితాలను నాశనం చేయడంతో పాటు మీ కుటుంబ సభ్యుల జీవితాలను నాశనం చేయకుండా ఉండాలి అంటే ఇంట్ల సిగరెట్ తాగొద్దు, వీలైతే పూర్తిగా సిగరెట్‌ను మానేయడం మంచిది అనే అభిప్రాయంను చాలా మంది ప్రముఖులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా, కోట్ల రూపాయలు ఖర్చు చేసి హెచ్చరించినా సిగరెట్ తాగే వారు మానేయడం లేదు.