Begin typing your search above and press return to search.

"హలో... నిద్రరావడం లేదు"... 14.5 లక్షలకు పైగా ఫోన్ కాల్స్!

అవును.. దేశంలో 24 గంటలపాటు మానసిక ఆరోగ్య సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మెంటల్ హెల్త్ హెల్ప్ లైన్ టెలీ మానస్ ను 2022 అక్టోబర్ లో ప్రారంభించింది.

By:  Tupaki Desk   |   12 Oct 2024 3:38 AM GMT
హలో... నిద్రరావడం లేదు... 14.5 లక్షలకు పైగా ఫోన్  కాల్స్!
X

ఒక మనిషి సంతోషంగా ఉన్నాడు, ప్రశాంతంగా బ్రతుకుతున్నాడు అని చెప్పడానికి ప్రామాణికం ప్రశాంతమైన నిద్ర అని అంటారు. మిగిలినవాటి సంగతి కాసేపు పక్కనపెడితే... ఓ మనిషి కనీసం 6 - 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోగలిగితే అతడు శరీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉన్నట్లే అని అంటుంటారు. అయితే ఈటైపు అనారోగ్యంతో చాలా మంది బాదపడుతున్నారు.

అవును.. దేశంలో 24 గంటలపాటు మానసిక ఆరోగ్య సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మెంటల్ హెల్త్ హెల్ప్ లైన్ టెలీ మానస్ ను 2022 అక్టోబర్ లో ప్రారంభించింది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రారంభించబడిన ఈ కార్యక్రమంలో టోల్ ఫ్రీ నంబర్ 14416లో 24*7 మానసిక ఆరోగ్య సేవలు అందజేస్తుంది.

అయితే.. రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న నెట్ వర్కింగ్ తాజాగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ప్రపంచ మనసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సంవత్సరం థీమ్.. "ఇది పని ప్రదేశంలో మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం" గా నిర్దేశించారు. ఈ సందర్భంగా టెలీ మానస్ యాప్, టెలీ మానస్ వీడియో కాల్ సౌకర్యాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్పందించిన అధికారులు... టెలీ మానస్ యాప్ అనేది మానసిక ఆరోగ్య సమస్యలకు మద్దతుని అందించడానికి అభివృద్ధి చెయడానికి ఒక సమగ్ర మొబైల్ ఫ్లాట్ ఫారం. ఈ యాప్ లో సెల్ఫ్ సేఫ్టీపై చిట్కాలు, సమస్య సంకేతాలను గుర్తించడం, ఆందోళన, ఒత్తిడి, భావోద్వేగ పోరాటాల ప్రారంభ సంకేతాలను నిర్వహించడం వంటి సమాచారంతో కూడిన లైబ్రరీ అని తెలిపారు.

ఈ క్రమంలో తాజాగా ఈ టెలీ మానస్ ప్రారంభించినప్పటి నుంచీ 14.5 లక్షలకు పైగా కాల్స్ ను నిర్వహించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుందని అంటున్నారు. ఇందులో ప్రధానంగా నిద్రా భంగం సమస్య మీదే 14% జనాలు కాల్స్ చేసినట్లు చెబుతున్నారు. తర్వాత మూడు బాగాలేకపోవడం గురించి 14% చేశారని చెబుతున్నారు.

ఒత్తిడి 11 శాతం, ఆందోళన 9% లు టాప్ ప్లేస్ లో ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఆత్మహత్యలకు సంబంధించి వచ్చిన కాల్స్ 3 శాతం కన్నా తక్కువ రావడం గమనార్హం. ఇక గత పది నెలల్లో 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తుల నుంచి 72 శాతానికి పైగా కాల్స్ వచ్చాయని చెబుతున్నారు.