Begin typing your search above and press return to search.

వీర్యకణాల ముప్పుకు ఏ అలవాట్లు కారణమో తెలుసా?

మనిషి సాంకేతికతతో కొత్త విషయాలు కనుగొంటున్నా వాటి వల్ల మానవ మనుగడ ప్రశ్నార్థకంలో మారుతోంది.

By:  Tupaki Desk   |   17 April 2024 4:50 AM GMT
వీర్యకణాల ముప్పుకు ఏ అలవాట్లు కారణమో తెలుసా?
X

మనిషి సాంకేతికతతో కొత్త విషయాలు కనుగొంటున్నా వాటి వల్ల మానవ మనుగడ ప్రశ్నార్థకంలో మారుతోంది. తన తెలివితో డెవలప్ మెంట్ చేశామని చెప్పుకుంటున్నా అందులో నెగెటివ్ కూడా ఉంటోంది. ఈనేపథ్యంలో మనిషి ప్రస్థానం ఉనికి కోల్పోతోంది. వాటి వాడకం వల్ల మానవుల పుట్టుక మీదే ప్రభావం చూపుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

మద్యపానం, ధూమపానం, ఫాస్ట్ ఫుడ్, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల మన డీఎన్ఏ దెబ్బ తినే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. వీటిని అతిగా వాడితే అనర్థాలే ఎదురవుతాయి. మద్యపానం వల్ల లివర్ దెబ్బ తింటుంది. ధూమపానం వల్ల ఊపిరితిత్తులకు ప్రమాదం ఏర్పడుతుంది. ఫాస్ట్ ఫుడ్ వల్ల కడుపే కీకారణ్యంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఇక స్మార్ట్ ఫోన్ వాడకం అన్ని సమస్యలకు కేంద్రమే.

ప్రస్తుతం చాలా మందిలో సంతాన లేమి సమస్య కనిపిస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. వీర్య నాణ్యత దెబ్బతినే అవకాశం ఉన్నందున పిల్లలు పుట్టడం లేదు. దీని వల్ల వంధ్యత్వ సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల వీర్య కణాల నాణ్యత దెబ్బతినే సూచనలున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. మహిళల్లో గర్భవిచ్ఛిత్తి ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు.

పిల్లలు పుట్టినా వారు అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఉందంటున్నారు. గర్భధారణ ఆలస్యమైనా వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్సలు తీసుకోవడం తప్పనిసరి. మన జీవన విధానం మార్చుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులే ఏర్పడతాయని తెలుసుకుని మసలుకుంటే మంచిదని అంటున్నారు.

యోగా, వ్యాయామం వంటివి చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. రోజు ఉదయం సాయంత్రం యోగా, వ్యాయామం చేసేందుకు సిద్ధపడాలి. దీని వల్ల మన డీఎన్ఏ నాణ్యత పెరుగుతుందని అంటున్నారు. మనం వాటికి ఎంత దూరంగా ఉంటే మనకు అంత శ్రేయస్కరం. కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అదే దారిలో వెళ్తున్నారు.