రెండు వారాల్లో షుగర్ కంట్రోల్.. మూలికలతో శాస్త్రవేత్తల సక్సెస్!e
అంతుచిక్కని మాయదారి రోగంగా అభివర్ణించే షుగర్ వ్యాధికి సంబంధించిన స్వీట్ న్యూస్ ఒకటి తెర మీదకు వచ్చింది
By: Tupaki Desk | 4 Nov 2023 3:57 AM GMTఅంతుచిక్కని మాయదారి రోగంగా అభివర్ణించే షుగర్ వ్యాధికి సంబంధించిన స్వీట్ న్యూస్ ఒకటి తెర మీదకు వచ్చింది. సంప్రదాయ పద్దతిలో.. మూలికలతో తయారు చేసిన ఔషధంతో శాస్త్రవేత్తలు సక్సెస్ సాధించిన వైనం వెలుగు చూసింది. తాజాగా బయటకు వచ్చిన ఒక అధ్యయన రిపోర్టు అందరిని ఆకర్షిస్తోంది. ఒకసారి వస్తే వెంటాడే షుగర్ వ్యాధిని నియంత్రిత పద్దతుల్లో కేవలం పద్నాలుగు రోజుల్లోనే చేసే విధానాన్ని అమలు చేసి.. పాజిటివ్ ఫలితాల్ని సొంతం చేసుకున్నట్లుగా చెబుతున్నారు.
బిహార్ రాష్ట్ర రాజధాని పట్నాకు చెందిన ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల.. ఆసుపత్రి పరిశోధకులు సంయుక్తంగా ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. తమ ప్రయోగంలో భాగంగా రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్న ఒక వ్యక్తిపై వారు ప్రత్యేక ఫోకస్ చేశారు. షుగర్ ను కంట్రోల్ చేసే బీజీఆర్ 34 మూలికా ఔషధాన్ని.. మరికొన్నింటిని కలిపిన కాంబినేషన్ ను సదరు వ్యక్తికి ఇచ్చారు. తీసుకునే ఆహారంలో నియంత్రణ చర్యలు చేపట్టారు.
రెండు వారాల పాటు అతడికి బీజీఆర్ 34, ఆరోగ్య వర్ధిని వాతి.. చంద్రప్రభావతి తదితర ఆయుర్వేద ఔషధాలతో పాటు.. కొవ్వును తగ్గించే మందుల్ని ఇచ్చారు. అదే సమయంలో జీవనశైలిలో సర్దుబాట్లు.. ఆహారంలో కొన్ని పరిమితుల్ని నిర్దేశించారు. ఇలా చేయటం ద్వారా పద్నాలుగు రోజుల్లోనే మార్పు కనిపించిన వైనాన్ని గుర్తించారు. చికిత్స ప్రారంభంలో అతడి షుగర్ లెవల్స్.. బిఫోర్ బ్రేక్ ఫాస్ట్ 254గా ఉంటే.. పద్నాలుగు రోజుల చికిత్స తర్వాత షుగర్ లెవల్స్ 124 ఎంజీ/డీఎల్ కు తగ్గటం విశేషం. తమ ప్రయత్నం ఫలించి.. సానుకూలఫలితాలు రావటంతో.. ఈ చికిత్సపై మరింత ఫోకస్ చేశారు. ఈ అధ్యయనం పలువురిని ఆకర్షిస్తోంది. మరింత లోతుగా అధ్యయనం చేస్తే.. మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.