కేన్సర్ కు మందు కనుగొన్న టాటా ఇనిస్టిట్యూట్.. ధర తెలిస్తే వావ్!!
ఆ సంగతి అలా ఉంటే... తాజాగా టాటా ఇనిస్టిట్యూట్ క్యాన్సర్ చికిత్సలో కీలక అడుగు వేసింది.
By: Tupaki Desk | 28 Feb 2024 11:23 AM GMTవైద్య ఆరోగ్య రంగంలో భారత్ సేవలు అద్భుతమంటూ బిల్ గేట్స్ తాజాగా ప్రశంసించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా టీకాల ఉత్పత్తి విషయంలో భారత్ సేవలు భేష్ అంటూ ఆయన ప్రశంసించారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా టాటా ఇనిస్టిట్యూట్ క్యాన్సర్ చికిత్సలో కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా ఒక ట్యాబ్లెట్ ను కనుగొంది. ఇప్పుడు ఈ విషయం ఎంతో ఆసక్తిగా మారింది.
అవును... ముంబైకి చెందిన టాటా ఇనిస్టిట్యూట్ తాజాగా క్యాన్సర్ అడుగులో కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా... ఒకసారి క్యాన్సర్ బారినపడి కోలుకున్న వారికి మరోసారి ఆ వ్యాధి రాకుండా నిరోధించే ట్యాబ్లెట్ ను రూపొందించింది. తాజాగా ఈ విషయాలను టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వెల్లడించింది. ఇదే సమయంలో... దీనికోసం సుమారు పదేళ్లపాటు పరిశోధనలు చేసినట్లు వెల్లడించింది.
తాజాగా ఈ విషయాలపై స్పందించిన టాటా మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ కేన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బడ్వే... ఈ టాబ్లెట్ ల పనితీరు పరీక్షించడం కోసం మనుషుల్లోని క్యాన్సర్ కణాలను ఎలుకల్లో ప్రవేశపెట్టి పరీక్షించినట్లు తెలిపారు. సాధారణంగా క్యాన్సర్ వచ్చిన వారికి రేడియేషన్, కీమోథెరపీ వంటి చికిత్సలు చేసినప్పుడు.. ఆ కణాలు చనిపోయే సమయంలో క్రోమాటిన్ పార్టికల్స్ ను రిలీజ్ చేస్తాయని.. అవి ఆరోగ్యవంతమైన కణాలను క్యాన్సర్ కారకంగా మారుస్తాయని తెలిపారు.
ఈ క్రమంలో... కొన్ని క్రోమాటిన్ పార్టికల్స్ ఆరోగ్యంగా ఉన్న క్రోమోజోంలతో కలిసిపోయి కొత్త ట్యూమర్ లకు కారణం అవుతాయని తమ పరిశోధనలో తేలిందని వెల్లడించారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం కోసం రిజ్వెరట్రాల్ అండ్ కాపర్ తో కూడిన ప్రో ఆక్సిడెంట్ టాబ్లెట్స్ ను ఎలుకలకు ఇచ్చినట్లు తెలిపారు. దీంతో ఇవి ఆరోగ్యవంతమైన కణాలను క్యాన్సర్ కణాలుగా మార్చే క్ర్మాటిన్ పార్టికల్స్ ను నాశనం చేసే ఆక్సిజన్ రాడికల్స్ ని ఉత్పత్తి చేశాయని తెలిపారు!
ఈ సమయలో టాటా ఇనిస్టిట్యూట్ రూపొందించిన ఈ ట్యాబ్లెట్... క్యాన్సర్ ట్రీట్ మెంట్ దుష్ప్రభావాలను 50శాతం వరకూ తగ్గించడంతోపాటు.. రెండోసారి క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడంలో 30శాతానికి పైగా ప్రభావవంతంగా పనిచేస్తుందని అంటున్నారు టాటా సంస్థకు చెందిన పరిశోధకులు. ఈ క్రమంలో ఈ ట్యాబ్లెట్స్ కోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ) నుంచి అనుమతి కోసం దరఖాస్తూ చేసుకున్నారని తెలుస్తుంది.
ఈ సమయంలో ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ అప్రూవల్ వచ్చిన అనంతరం ఈ ఏడాది జూన్ - జూలై నుంచి ఈ ట్యాబ్లెట్ లు మార్కెట్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక క్యాన్సర్ చికిత్సకు లక్షల్లో ఖర్చవుతుండగా... ఈ ట్యాబ్లెట్ ను మాత్రం రూ.100కు అటు ఇటుగా అందుబాట్లోకి తెస్తామని టాటా సంస్థ పరిశోధకులు చెబుతున్నారు!