Begin typing your search above and press return to search.

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ..!

రక్తం నుండి టాక్సిన్స్, అదనపు ద్రవాలను ఫిల్టర్ చేయడంలో మూత్రపిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.

By:  Tupaki Desk   |   29 Jun 2024 4:28 AM GMT
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ..!
X

మన శరీరంలో ముఖ్యమైన అవయవాలలో ఒకటి మూత్రపిండాలు. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. రక్తం నుండి టాక్సిన్స్, అదనపు ద్రవాలను ఫిల్టర్ చేయడంలో మూత్రపిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మారిన ఆహారపు అలవాట్ల మూలంగా మూత్రపిండాల వ్యాధులు ఎక్కువై మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వాటిని ఆరోగ్యంగా ఉంచడం మీద దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.

విత్తనాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. నిత్యం వీటిని తింటే కిడ్నీ ఆరోగ్యం మెరుగవుతుంది. మూత్రపిండాల ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఉదయం బాదం, చియా గింజలు, అవిసె గింజలు వంటి వాటిని తినవచ్చు. రోజూ ఉదయం పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. యాపిల్స్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి పండ్లను తీసుకోవడం వల్ల కిడ్నీలకు మేలు జరుగుతుంది. ఇవి మూత్రపిండాలు దెబ్బతినకుండా కాపాడతాయి.

ప్రతి రోజూ ఉదయాన్నే కూరగాయల జ్యూస్ తాగడం మంచిది. దోసకాయ, పొట్లకాయ లేదా పాలకూర జ్యూస్ త్రాగాలి. వీటిలో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. ఇది మూత్రపిండాలను క్యూర్ చేయడానికి సహాయపడుతుంది. కూరగాయల రసాలలో విటమిన్లు ఖనిజాలు కూడా ఉంటాయి. ఆకుపచ్చ కూరగాయలు: ఫోలిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్లు,విటమిన్ సి వంటి పోషకాలు ఆకు కూరలలో లభిస్తాయి. తినే ఆహారంలో ఆకు కూరలను చేర్చుకోవాలి. ఆకు కూరలు తీసుకోవడం వల్ల కిడ్నీలు డిటాక్సిఫై అవుతాయి. టాక్సిన్స్ అన్నీ తొలగిపోతాయి.