Begin typing your search above and press return to search.

టైప్ -2 మధుమేహం.. ఆ డ్రింక్స్ దే తప్పంతా..

‘భారత దేశం మధుమేహ రాజధాని..’ ఈ మాట వినేందుకు కాస్త ఇబ్బందిగా ఉన్నా నిజం. 30 ఏళ్లకే షుగర్ బారిన పడుతున్న యువత కూడా ఉన్నారు మన దేశంలో.

By:  Tupaki Desk   |   14 Jan 2025 9:30 PM GMT
టైప్ -2 మధుమేహం.. ఆ డ్రింక్స్ దే తప్పంతా..
X

‘భారత దేశం మధుమేహ రాజధాని..’ ఈ మాట వినేందుకు కాస్త ఇబ్బందిగా ఉన్నా నిజం. 30 ఏళ్లకే షుగర్ బారిన పడుతున్న యువత కూడా ఉన్నారు మన దేశంలో. శారీరక శ్రమ లోపించడం, తీసుకునే ఆహారం.. అనారోగ్యకర అలవాట్లు.. ఇవీ టైప్-2 డయాబెటిస్ కు కారణాలు. వీటికితోడు మరో పెద్ద కారణం కూడా ఉంది. అది అందరికీ తెలిసిందే. కానీ అవాయిడ్ చేయలేనంత వ్యసనంగా మారిపోయింది.

కూల్ గా ప్రాణాలు తోడేస్తాయి.. కూల్ డ్రిక్స్ గురించి చెప్పాలంటే ఈ మాట సరిగ్గా సరిపోతుంది. ఒకటా రెండా.. ఏ ఫంక్షన్ చూసినా కూల్ డ్రింక్ లేకుండా ఉండదు. అందుకే భారత దేశం మధుమేహ రాజధాని అయిందా? అనే అనుమానం కలుగుతుంటుంది.

శీతల పానీయాలు.. చక్కెర కంటెంటో తో కూడినవి. ఇదే టైప్-2 డయాబెటిస్ కు దారితీస్తోంది. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. ఒకవిధంగా చెప్పాలంటే కూల్ డ్రింక్స్ కూడా అంతే. అయినా ప్రజలు మానడం లేదు. చివరకు అదే చాలామందిలో టైప్ -2 డయాబెటిస్‌ కు దారితీస్తోంది.

ఆకర్షణలో పడిపోయి..

ఏదైనా వస్తువును కొనాలంటే దానిపట్ల మనం ఆకర్షితులయ్యేలా చేయాలి. శీతల పానీయాల సంస్థలు ఇదే విధంగా చేస్తున్నాయి. తమ టార్గెట్ అయిన ప్రజలను ఆకట్టుకోవడానికి వివిధ రూపాల్లో అడ్వర్టయిజ్ మెంట్లు ఇస్తున్నాయి. ఇలా కూల్ డ్రింక్స్ అతిగా తీసుకోవడం చివరకు ఎలాంటి ప్రభావాలకు గురవుతున్నారో నివేదిస్తూ ఓ అధ్యయంన వెలువడింది. దీనిని చదివితే కొందరైనా కూల్ డ్రింక్స్ ను తాగడం మానేయడం ఖాయం.

శీతల పానీయాలు తాగుతూ.. ఏడాదిలో దాదాపు 22 లక్షల మంది టైప్-2 మధుమేహంతో బాధపడుతున్నారని, 12 లక్షల మందికి గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని అమెరికాకు చెందిన టఫ్ట్ యూనివర్సిటీ పేర్కొంది. 2020లో వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ఈ చక్కెర పానీయాలను తీసుకున్న తర్వాత 9.8 శాతం మంది టైప్ -2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారని తేల్చింది.