Begin typing your search above and press return to search.

ఈ పిల్ వేసుకుంటే కొలెస్ట్రాల్ ఆల్ మోస్ట్ తగ్గిపోతుందా?

వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో చాలా మందికి ఉండే అతి పెద్ద సమస్య కొలెస్ట్రాల్ అని చెప్పుకోవచ్చు.

By:  Tupaki Desk   |   21 Nov 2024 1:30 AM GMT
ఈ పిల్ వేసుకుంటే కొలెస్ట్రాల్ ఆల్ మోస్ట్ తగ్గిపోతుందా?
X

వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో చాలా మందికి ఉండే అతి పెద్ద సమస్య కొలెస్ట్రాల్ అని చెప్పుకోవచ్చు. తగినంత శారీరక శ్రమ లేకపోవడం దీనికి ఒక కారణం కాగా.. ఆహారపు అలవాట్లు మరో కీలక సమస్య. ఫలితంగా.. వయసుతో సంబంధం లేకుండానే గుండె జబ్బుల బారినపడుతున్నారు.

ఇలా అధిక కొలెస్ట్రాల్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొలెస్ట్రాల్ ను గణనీయంగా తగ్గించే సరికొత్త పిల్ ను అమెరికన్ ఔషధ సంస్థ "ఎలీ లిల్లీ" అభివృద్ధి చేసింది. దీంతో.. ఆ పిల్ ఎలా పని చేస్తుంది.. ఏ మేరకు పరిష్కారం చూపిస్తుంది అనేది ఆసక్తిగా మారింది.

అవును.. "ఎలీ లిల్లీ" అనే అమెరిక ఔషధ సంస్థ కొలెస్ట్రాల్ ను తగ్గించే పిల్ ను ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసింది. దీనికి "మువలప్లిన్" అని నామకరణం చేసింది. ఈ పిల్ ను ఉపయోగించడం వల్ల కొలెస్ట్రాల్ 70 నుంచి 86 శాతం మేర తగ్గినట్లు పరీక్షలో తేలినట్లు షికాగోలో జరిగిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ లో వెల్లడించారు.

ఈ పిల్ కు సంబంధించిన మిడ్ స్టేజ్ ట్రయల్స్ లో పరిశోధకులు... అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న 233 మంది వయోజనలుపై పరిక్షించారని చెబుతున్నారు. వీరిలో కొంతమందికి 10 మిల్లీ గ్రాములు, ఇంకొంతమందికి 60 మిల్లీ గ్రాములు, మరికొంతమందికి 240 మిలీ గ్రాముల డోస్ ఇచ్చారంట.

అనంతర పరీక్షలు చేయగా.. 10 మి.గ్రా. డోసు తీసుకున్నవారిలో 40.4 - 47.6 శాతం.. 60 మి.గ్రా. డోసు తీసుకున్నవారిలో 68.9 నుంచి 81.7 శాతం.. 240 మి.గ్రా. డోసు తీసుకున్నవారిలో 70 నుంచి 85.8 శాతం మేర కొలెస్ట్రాల్ తగ్గినట్లు తేలిందని పరిశోధకులు వెల్లడించారు.