Begin typing your search above and press return to search.

డాక్టర్ ఎందుకు సొంత వైద్యం చేస్తారా? ఈ ఉదంతం గురించి చదవాల్సిందే

హైదరాబాద్ కు చెందిన ఒక యువతి ఆర్కిటెక్టుగా పని చేస్తున్నారు. ఆమెకు పదే పదే జ్వరంతోపాటు యూరిన్ కు వెళ్లినప్పుడు మంట వస్తోంది.

By:  Tupaki Desk   |   2 Dec 2023 4:42 AM GMT
డాక్టర్ ఎందుకు సొంత వైద్యం చేస్తారా? ఈ ఉదంతం గురించి చదవాల్సిందే
X

చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఓకే. ఒకే ఆరోగ్య సమస్య పదే పదే ఎదురవుతున్నప్పుడు.. అన్ని తెలిసినట్లుగా సొంత వైద్యం చేసుకోవటంలో ఉండే రిస్కు ఎంత ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని తెలియజేసే ఉదంతంగా దీన్ని చెప్పాలి. హైదరాబాద్ మహానగరానికి చెందిన ఒక తండ్రి.. తన కుమార్తెకు సొంత వైద్యం పేరుతోచేసిన ప్రక్రియ వికటించటమే కాదు.. ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఈ ఉదంతాన్ని అందరూ ఒక గుణపాఠంగా భావించాల్సిన అవసరం ఉంది. షాకింగ్ గా మారిన ఈ ఉదంతానికి సంబంధించిన సమాచారాన్ని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీకి చెందిన డాక్టర్ రాఘవేంద్ర కులకర్ణి వెల్లడించారు.

హైదరాబాద్ కు చెందిన ఒక యువతి ఆర్కిటెక్టుగా పని చేస్తున్నారు. ఆమెకు పదే పదే జ్వరంతోపాటు యూరిన్ కు వెళ్లినప్పుడు మంట వస్తోంది. పదే పదే ఇలాంటి పరిస్థితి రావటం.. పరిస్థితి తీవ్రం కావటంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. సిటీ స్కాన్ చేసిన వైద్యులుఆమె కిడ్నీల్లో 10613 మిల్లీ మీటర్ల పరిణామంలో ఉన్న రాళ్లను గుర్తించారు. దీంతో.. షాక్ తిన్న వైద్యులు.. బాధిత యువతిని.. తండ్రిని మెడికల్ హిస్టరీ గురించి లోతుగా ఆరా తీశారు.

ఈ సందర్భంగా బాధిత యువతితో పాటు ఆమె తండ్రి మాటల్లో ఒక విషయాన్ని గుర్తించారు. అదేమంటే.. ఆమెకు ఏదైనా అనారోగ్యం ఏర్పడినప్పుడు ఆమె తండ్రి గూగుల్ లో వెతికి యాంటీ బయాటిక్స్ తెచ్చి ఇచ్చేవారు. ఆ కోర్సును కూడా పూర్తిగా వాడని సదరు యువతి.. సగం వాడిన తర్వాత ఆపేశారు. ఇలా అనారోగ్యం ఏర్పడినంతనే ఇలా గూగుల్ లో వెతికిన మందుల్ని వాడటంతో ఆమె బాడీలో యాంటీ బయాటిక్స్ నిరోధకత పెరిగి.. మందులకు లొంగని బ్యాక్టీరియా ఏర్పడింది.

మోతాదుకు మించి యాంటీ బయాటిక్స్ వాడటం వల్ల ప్రోటీన్లు గట్టిబడి.. కిడ్నీలో రాళ్లుగా మారి.. అది కాస్తా యూరిన్ ఇన్ ఫెక్షన్ కు దారి తీసింది. ఆమెకు సర్జరీ ద్వారా రాళ్లను తొలగించారు. వైద్యుల్ని సంప్రదించకుండా అతిగా యాంటీ బయాటిక్స్ వాడటం ఏ మాత్రం మంచిది కాదని.. అది ప్రమాదకరమన్న విషయాన్ని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు.. ఏదైనా మందుల్ని కోర్సుగా కాకుండా సగం వాడేసి ఆపేస్తే.. మరింత ముప్పుగా హెచ్చరిస్తున్నారు. సో.. సొంత వైద్యం చేసుకునే వాళ్లు పారాహుషార్.