వీగన్స్ బీ కేర్ ఫుల్... ఎముకలు, మెదడు సమస్యలు!
వీగన్ డైట్ వల్ల హార్ట్ ఎటాక్, డైవర్టికులర్ డిసీజ్ లతో పాటు డయాబెటీస్ వచ్చే ప్రమాదం తక్కువని పలు పరిశోధనలు తేల్చాయని
By: Tupaki Desk | 27 March 2024 2:30 AM GMTమాంసాహారంతో పాటు జంతు ఉత్పత్తులనూ తినని వారిని వీగన్స్ అంటారు. ఈ మధ్యకాలంలో "వీగనిజం" ఒక ట్రెండ్ గా మారుతోన్న సంగతి తెలిసిందే. ఇలా మాంసాహారంతో పాటు పాల ఉత్పత్తులను తినని వారి వల్ల పర్యావరణానికి ఎంత ఉపయోగం అనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఈ వీగన్ డైట్ వల్ల మాత్రం అనేక రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు. దీంతో ఇప్పుడు ఈ అంశం ఆసక్తికరంగా మారింది.
అవును... అప్పటివరకూ మాంసాహారిగా మారుతోన్న చాలా మంది తమ ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతోందని నమ్ముతున్నారు! ఇదే సమయంలో వీగన్స్ గా మారితే మరింత ఆరోగ్యంగా ఉండొచ్చని, ఎక్కువకాలం బ్రతకొచ్చనే అపోహ కూడా ఉందని చెబుతున్నారు. అయితే... వీగన్ గా మారడం వల్ల మరింత ఆరోగ్యంగా ఉంటారనే అంశానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారమూ లేదని అంటున్నారు! పైగా... ఈ వీగన్ డైట్ వల్ల కొన్ని ప్లస్ లు ఉన్నా.. అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని పలు పరిశోధనలు చెబుతున్నాయని తెలుస్తుంది.
వీగన్ డైట్ వల్ల హార్ట్ ఎటాక్, డైవర్టికులర్ డిసీజ్ లతో పాటు డయాబెటీస్ వచ్చే ప్రమాదం తక్కువని పలు పరిశోధనలు తేల్చాయని చెబుతున్న సమయంలోనే... ఈ వీగన్ ఫుడ్ వల్ల ఎములకు ధృఢంగా ఉండబోవని, ఫలితంగా ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, మాంసాహారులతో పోలిస్తే వీరికి చిన్న దెబ్బ తగిలినా తుంటి, కాలి ఎముకలు విరిగే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు!
వాస్తవానికి వీగన్స్ తమ శరీరంలో పోషక లోపాలను నివారించడంకోసం విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారాన్ని తప్పక స్వీకరించాలట. అయితే... వీగన్స్ తీసుకునే ఆహారం ద్వారా సరైన మోతాదులో విటమిన్ బీ 12, ఐరన్ శరీరానికి తగిన మోతాదులో అందకపోతే అది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఇదే సమయంలో ఇది మెదడు పనితీరుపైనా ప్రభావం చూపించే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారట!
కాగా... 1944 నవంబర్ నెలలోనే ది వీగన్ సొసైటీని డొనాల్డ్ వాట్సన్ ఏర్పాటు చేశారు. వీగన్, వీగనిజం అనే పదాలు కూడా అప్పుడే! దీంతో... ప్రతీ ఏటా నవంబర్ 1వ తేదీన వరల్డ్ వీగన్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారు!