Begin typing your search above and press return to search.

ఇకపై ఆఫీసుల్లో 'వై బ్రేక్'... మేటర్ ఏమిటంటే...?

దాదాపు అన్ని ఆఫీసుల్లోనూ ఈ తరహా బ్రేక్ లు ఉంటాయి. అయితే తాజాగా వాటితోపాటు "వై బ్రేక్‌" కూడా ఉండాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది.

By:  Tupaki Desk   |   11 Aug 2023 3:15 AM GMT
ఇకపై ఆఫీసుల్లో వై బ్రేక్... మేటర్  ఏమిటంటే...?
X

భారతదేశంలో మిలియన్‌ మంది ఉద్యోగులు విపరీతమైన ఒత్తిడికి గురవ్వుతున్నారని.. కొందరు ఉద్యోగులు ఆఫీస్‌ లో పనిభారాన్ని, మరోవైపు కుటుంబాన్ని లీడ్‌ చేయలేక వివిధ అనారోగ్య సమస్యలు భారినపడుతున్నట్లు సర్వే వెల్లడించింది. దీంతో ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

అవును... కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు టీ బ్రేక్‌, లంచ్‌ బ్రేక్‌, స్నేక్స్ బ్రేక్, డిన్నర్‌ బ్రేక్‌ లు ఉండటం కామన్. దాదాపు అన్ని ఆఫీసుల్లోనూ ఈ తరహా బ్రేక్ లు ఉంటాయి. అయితే తాజాగా వాటితోపాటు "వై బ్రేక్‌" కూడా ఉండాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇది ఉద్యోగుల ఆరోగ్యం కోసమేనని స్పష్టం చేసింది.

ఇందులో భాగంగా... గత నెలలో అంతర్జాతీయ యోగ దినోత్సవం రోజు ఆయుష మంత్రిత్వ శాఖ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. "వై-బ్రేక్ ఎట్ ఆఫీస్ చైర్" అనే సరికొత్త కార్యక్రమానికి నాంది పలికింది. ఉద్యోగుల దినచర్యలో "యోగా"ని భాగస్వామ్యం చేసి తద్వారా ఒత్తిడిని దూరం చేయాలని భావించింది.

దీనికే "వై బ్రేక్" అని నామకరణం చేసింది. ఇక నుంచి మాములుగా తీసుకునే బ్రేక్‌ లు మాదిరిగా దీన్ని తీసుకుంటూ.. కాస్త పని ఒత్తిడి దూరం చేసుకోవడమే గాక, తమ ఏకాగ్రతను పెంచుకుని షార్ప్‌ గా తయారవ్వతారని ఆయుష్‌ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడుతుంది.

ఈ మేరకు హ్యుమన్‌ ఎడ్జ్‌ వ్యవస్థాపకుడు సీఈవో డాక్టర్‌ మార్కస్‌ రాన్నీ ఈ "వై బ్రేక్" విధానాన్ని స్వాగతించారు. ఉద్యోగులు శారీరకంగానూ, మానసికంగానూ పిట్‌ గా ఉండేదుకు ఈ విధానం దోహదపడుతుందని.. పనిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా చేయగలుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో అలాగే ఒత్తడికి కారణమయ్యే అడ్రినల్‌ హార్మోన్ల విడుదలపై ప్రభావవంతంగా ఈ వైబ్రేక్ పనిచేస్తుందని.. రక్తపోటును నియంత్రిస్తుందని అంటున్నారు. ఇదే క్రమంలో... ఇందులో చేసే '"బ్రీథింగ్‌ ఎక్సర్‌ సైజ్‌"లు కారణంగా లోతుగా ఆలోచించగల సామర్థ్యం అలవడుతుందని చెబుతున్నారు.

ఇదే క్రమంలో... "వై బ్రేక్‌" వల్ల ఉద్యోగులు ఫిట్‌ గా ఉండి పని బాగా చేయడంతోపాటు సెలవులు పెట్టే వాళ్ల సంఖ్య తగ్గుతుందని.. ఇదే సమయంలో వారి పని సామర్థ్యం కూడా ఎక్కువ అవుతుందని మార్కస్‌ చెబుతున్నారు.