Begin typing your search above and press return to search.

ఎల్.ఐ.సీ. నయా ప్లాన్.. జీవితాంతం ఏటా లక్షకు పైగా పెన్షన్!

అందులో భాగమే కొత్త విడుదల చేసిన ఈ ఎల్.ఐ.సీ. ప్లాన్ నం. 858 - జీవన్ శాంతి!

By:  Tupaki Desk   |   30 Aug 2023 7:43 AM GMT
ఎల్.ఐ.సీ. నయా ప్లాన్.. జీవితాంతం ఏటా లక్షకు పైగా పెన్షన్!
X

భారతీయ అతిపెద్ద భీమా సంస్థ ఎల్.ఐ.సీ. తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అందిస్తుంటున్న సంగతి తెలిసిందే. దీంతో దేశంలో ఎన్నో బీమా సంస్థలు ఉన్నప్పటికీ... ఎక్కువమంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందించే పాలసీలనే ఎక్కువగా కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారని అంటుంటారు. ఈ సమయంలో తాజాగా మరో ప్లాన్ తెరపైకి వచ్చింది.

అవును... ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. "ఎల్.ఐ.సి. న్యూ జీవన్ శాంతి" పేరుతో డిఫర్డ్ యాన్యూటీ ప్లాన్ ను తీసుకువచ్చింది. సాధారణంగా ఎల్.ఐ.సీ.లో సేవింగ్ స్కీంస్ కాకుండా స్కీంస్ ను కొనుగోలు చేస్తే మరింత ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. అందులో భాగమే కొత్త విడుదల చేసిన ఈ ఎల్.ఐ.సీ. ప్లాన్ నం. 858 - జీవన్ శాంతి!

ఏమిటీ న్యూ జీవన్ శాంతి ప్లాన్?:

ఈ ప్లాన్ గురించి సింగిల్ లైన్ లో చెప్పాలంటే... ఒకేసారి పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించి ఈ ప్లాన్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే... ఈ పాలసీ నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటెడ్ యాన్యుటీ ప్లాన్ అన్నమాట. ఈ ప్లాన్ లో అందించే యాన్యుటీ రేట్లకు గ్యారంటీ ఉంటుంది. ఫలితంగా ఈ పాలసీ తీసుకునే సమయంలోనే వచ్చే పెన్షన్ నిర్ధరణ అవుతుంది.

ఈ పాలసీలో 2 రకాల యాన్యుటీ ప్లాన్ లను అందిస్తుంది. ఇందులో మొదటిది "డిఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్" కాగా.. మరొకటి "డిఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్"!

ఈ ప్లాన్ ను ఎవరు కనుగోలు చేయవచ్చు?:

ఈ ప్లాన్ ను కనుగోలు చేయాలంటే ఆ వ్యక్తికి మినిమం 30 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠంగా 79 ఏళ్ల వయస్సున్న వారెవరైనా ఈ "ఎల్.ఐ.సి. జీవన్ శాంతి ప్లాన్‌"ను కొనుగోలు చేయవచ్చు. మరిముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... పాలసీ ప్రారంభంలో ఎంచుకున్న కాలవ్యవధిని భవిష్యత్తులో మార్చుకోవడానికి వీలుండదు. అంటే... డ్యూరేషన్ ని ముందే ఫిక్స్ చేసుకోవాలన్నమాట.

ఈ పాలసీని తీసుకునే సమయంలోనే సంస్థ నిర్దేశించిన మినిమం మొత్తాని చెల్లించి ప్లాన్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని కనీస కొనుగోలు ధరను రూ.1.5 లక్షలుగా ఫిక్స్ చేశారు. గరిష్ఠ పరిమితులు లేవు. ఇందులో నెలవారీగా, మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకోసారి లేదా ఏడాదికి... ఇలా వారి వారి ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ప్రీమియంలను చెల్లించే సౌలభ్యం ఉంటుంది.

ఎంత పెన్షన్ పొందవచ్చు?:

ఉదాహరణకు 30 ఏళ్ల వయస్సులో రూ.10 లక్షలతో ఈ పాలసీని 5 సంవత్సరాల డిఫర్డ్ యాన్యుటీతో కొన్నారనుకుంటే... ఆ వ్యక్తి 35 ఏళ్ల వయసులో రూ.86,784ను పెన్షన్ కింద పొందుతారు. అదే 12 సంవత్సరాలు డిఫర్డ్ యాన్యుటీతో కొనుగోలు చేస్తే 42 ఏళ్లు వచ్చేసరికి రూ.1,32,920 వార్షిక పెన్షన్ ను పొందవచ్చు.