ఏఐలో ఉద్యోగాలు ఎంత భారీగా వస్తాయంటే?
కానీ.. మనిసి పరిణామ క్రమాన్ని చూస్తే.. అవన్నీ ఉత్త భయాలే అన్న విషయం ఇట్టే అర్తమవుతుంది.
By: Tupaki Desk | 11 March 2025 10:31 AM ISTసరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చినంతనే.. ఉద్యోగాలకు కోత పడుతుందన్న భావన మొదట్నించి ఉన్నదే. అయితే.. కొత్త ఆవిష్కరణలతో మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయే తప్పించి తగ్గవన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకుంటే.. ఆయా రంగాల విస్తరణ.. ఉపాధి అవకాశాల్ని మరింత పెంచేలా చేస్తుంది. చేతితో పనులు చేసే స్థానే మెషిన్లు వచ్చినప్పుడు వాటిపైన వ్యతిరేకత భారీగా ఉండేది. మెషిన్లు ఉపాధి అవకాశాలు కోల్పోయేలా చేస్తాయని. కానీ.. మనిసి పరిణామ క్రమాన్ని చూస్తే.. అవన్నీ ఉత్త భయాలే అన్న విషయం ఇట్టే అర్తమవుతుంది.
కొద్ది రోజులుగా ఏఐ (కృత్రిమ మేధ)తో ఉద్యోగాలు భారీగా పోతాయని.. ఐటీ సంస్థలు ఉద్యోగుల్ని తొలగిస్తాయన్న ఆందోళన మార్కెట్ లో భారీగా ఉంది. అయితే.. అమెరికాకు చెందిన మేనేజ్ మెంట్ కన్సల్టింగ్ కంపెనీ బెయిన్ అండ్ కంపెనీ ఒక అధ్యయనాన్ని చేపట్టింది. ఇందులో పేర్కొన్న అంశాలు ఆసక్తికరంగానే కాదు.. భవిష్యత్ మీద మరింత భరోసాను కలుగజేసేలా ఉన్నాయని చెప్పక తప్పదు.
కృత్రిమ మేధకు సంబంధించి అంతర్జాతీయ నిపుణుల కేంద్రంగా మన దేశం మారుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈ విషయంలో నైపుణ్య అంతరం మీదనే సందేహాలు ఉన్నాయని చెప్పొచ్చు. 2027 నాటికి 10 లక్షల మందికి పైగా ఏఐ నిపుణుల కొరత ఏర్పడొచ్చన్న అంచనా వ్యక్తమవుతోంది. ఈ అవకాశాల్ని సొంతం చేసుకోవటానికి వీలుగా ఈ నైపుణ్యాల మీద పట్టు సాధించటం అవసరమని చెబుతున్ానరు.
2027 నాటికి మార్కెట్ లో ఉండే ఏఐ నిపుణులకు 1.5 - 2 రెట్లు ఉద్యోగాలు కనిపిస్తాయని.. అదే సమయంలో ప్రస్తుత సిబ్బందిలో కచ్ఛితంగా 10 లక్షల మందికి ఏఐ నైపుణ్యాల్ని నేర్పించాల్సి ఉంటుంది. 2019 నుంచి ఏఐ ఆధారిత ఉద్యోగాలు పెరగటంతో పాటు. ఏటా దీని వ్రద్ధి 21 శాతంగా ఉంది. ఏఐ నిపుణుల జీతాలు సైతం ఏటా 11 శాతం చొప్పున పెరుగుతున్నాయి. గిరాకీ.. ఆకర్షణీయ వేతనాలు.. అర్హత కలిగిన ఏఐ వ్రత్తి నిపుణుల కొరత కనిపిస్తోంది. ఇక్కడే మరో ఆందోళన కలిగించే అంశాన్ని చెబుతున్నారు.
ఏఐలో మహిళల సంఖ్య తక్కువగా ఉండటం సమస్య మాత్రమే కాదు.. భవిష్యత్తు నిర్మాణానికి ఇబ్బందిగా చెబుతున్నారు. ఏఐలోని వ్యక్తుల్లో వైవిధ్యం ప్రతిబింబించాలని లేదంటే భవిష్యత్తులో ఇప్పటి పక్షపాత ధోరణులే ఉంటాయని చెబుతున్నారు. అందుకే.. ఏఐలోకి పెద్ద ఎత్తున అమ్మాయిలు ముందుకు రావాలన్న మాట బలంగా వినిపిస్తోంది. ఏఐ ప్రతి మనిషి జీవితాన్ని.. అంశాన్ని మారుస్తుందని.. డేటాపైన ఆధారపడే అది పని చేస్తుందని చెప్పారు మైక్రోసాఫ్ట్ ఇండియా.. దక్షిణాసియా చీఫ్ పార్టనర్ ఆఫీసర్ హిమానీ అగర్వాల్. సో.. ఏఐ కారణంగా వచ్చే సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించే కన్నా.. దానితో వచ్చే అవకాశాల మీద ఫోకస్ పెట్టటం చాలా అవసరం.