Begin typing your search above and press return to search.

బ్యాడ్ న్యూస్ చెబుతున్న క్యాంపస్ రిక్రూట్మెంట్స్... కారణం ఇదే!

మెయిన్ కాంపస్ ల సంగతే అలా ఉంటే... ఇక ద్వితీయ శ్రేణి కళాశాలల్లో నాలుగో వంతు విద్యార్థులకు కూడా ఉద్యోగాలు దక్కకపోవడం గమనార్హం.

By:  Tupaki Desk   |   17 Jan 2024 11:30 PM GMT
బ్యాడ్  న్యూస్  చెబుతున్న క్యాంపస్  రిక్రూట్మెంట్స్... కారణం ఇదే!
X

సాధారణంగా ఇంజినీరింగ్ కళాశాలలో జాయిన్ అయ్యే విద్యార్థులూ, వారి తల్లితండ్రులు సైతం క్యాపస్ ఇంటర్వ్యూలో సెలక్ట్ అయ్యి.. కాలేజీ నుంచి బయటకు సర్టిఫికెట్స్ తో పాటు అపాయింట్ మెంట్ లెటర్ కూడా చేతిలో ఉండాలని భావిస్తుంటారు. అలా ఆ ఆలోచనను నిజం చేసుకున్నవాళ్లు సైతం వేలల్లో ఉంటారనేది తెలిసిన విషయమే. అయితే తాజాగా ఈ క్యాంపస్ ప్లేస్ మెంట్స్ ఆల్ మోస్ట్ సగానికి పడిపోయాయి!

అవును... ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు ఈసారి సుమారు 50 శాతానికిపైగా తగ్గాయని తెలుస్తుంది. మెయిన్ కాంపస్ ల సంగతే అలా ఉంటే... ఇక ద్వితీయ శ్రేణి కళాశాలల్లో నాలుగో వంతు విద్యార్థులకు కూడా ఉద్యోగాలు దక్కకపోవడం గమనార్హం. ఇక చిన్న కళాశాలల్లో క్యాంపస్ ఇంటర్వ్యూ అనే టాపిక్కే లేదు. అయితే ఈ పరిస్థితి కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు.

ఈ పరిస్థితి ఇటు రాష్ట్రం, అటు దేశంలోనే కాదు.. ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరం (2023-24)లో దాదాపు ప్రతీ కాలేజీలోనూ ఇదే పరిస్థితి నెలకొందని క్యాంపస్ ప్లేస్ మెంట్స్ అధికారులు చెబుతున్నారు. దీనికి కారణం... అమెరికాతోపాటు యూరప్‌ దేశాలలోనూ నెలకొన్న ఆర్థిక మందగమనమే అని స్పష్టం చేస్తున్నారు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని చెబుతున్నారు.

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఏటా 50 వేల నుంచి 60 వేల మంది బీటెక్‌ విద్యార్థులు ఉత్తీర్ణులవుతుండగా.. వారిలో సుమారు 35 వేల మంది వరకు ఆన్‌ లైన్‌, ఆఫ్‌ లైన్‌ ద్వారా వివిధ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఏటా బీటెక్‌ చివరి సంవత్సరం తొలి సెమిస్టర్‌ ప్రారంభం కాగానే ఈ క్యాంపస్ ప్లేస్ మెంట్స్ సందడి మొదలవుతుంటుంది.

అంటే ఈ ఏడాది... 2020-21 విద్యాసంవత్సరంలో బీటెక్‌ లో జాయిన్ అయినవారిని కంపెనీలు రిక్రూట్ చేసుకుంటాయన్నమాట. అందుకు పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. ఈ ప్రక్రియ సాధారణంగా ఏటా జులై నెలాఖరులో లేదా ఆగస్టులో మొదలవుతుంటుంది. దీంతో... పలు కాలేజీల్లో 80-90 శాతం నియామకాలు డిసెంబరుకు పూర్తవుతాయి. మిగిలిన 10-20 శాతం మందికోసం అన్నట్లుగా రెండో విడతలో జనవరి నుంచి మే వరకు కొన్ని కంపెనీలు వస్తుంటాయి.

అయితే ఈసారి టాప్‌ కాలేజీల్లో సైతం డిసెంబరు నాటికి 50-55 శాతం మంది కూడా సెలక్ట్ కాలేదని చెబుతున్నారు. మిగిలిన పలు కళాశాలల్లో కేవలం 20 నుంచి 30 శాతంలోపే నియామకాలు దక్కాయని అంటున్నారు. ఈ క్రమంలో... ఏటా దేశవ్యాప్తంగా సుమారు 2 లక్షల మందిని వివిధ సంస్థలు నియమించుకుంటాయి!

వారిలో సుమారు 1.70 లక్షల మందిని టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, హెచ్.సీ.ఎల్, విప్రో, డెలాయిట్‌, యాక్సెంచర్‌, క్యాప్‌ జెమినీ వంటి సర్వీస్‌ కంపెనీలే నియమించుకుంటాయి. ఇక మిగిలిన వారిని మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఒరాకిల్‌, సర్వీస్‌ నౌ, ఐబీఎం లాంటి కొత్త సాఫ్ట్ వేర్ లను రూపొందొంచే కంపెనీలు తీసుకుంటాయి. అయితే ఈసారి సర్వీస్‌ కంపెనీలు క్యాంపస్ ప్లేస్ మెంట్స్ కి ముందుకు రాకపోవడంతో ఉద్యోగాల సంఖ్య భారీగా పడిపోయింది.