Begin typing your search above and press return to search.

ఐటీలో ఉద్యోగుల కోత‌.. ఏప్రిల్‌లో 21 వేల మంది ఇంటికి!

తాజాగా ఐటీ రంగంలో ఒక్క ఏప్రిల్ నెల‌లో 21వేల మందిని ఇంటికి పంపించేశారంటే.. ఆశ్చ‌ర్యం వేస్తుంది. ఇలా చేసిన‌వి ఏవో చిన్న సంస్థ‌లు కావు. పెద్ద పెద్ద మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీలు.

By:  Tupaki Desk   |   2 May 2024 11:30 AM GMT
ఐటీలో ఉద్యోగుల కోత‌.. ఏప్రిల్‌లో 21 వేల మంది ఇంటికి!
X

ఐటీ ఉద్యోగం అంటే.. హుందా. వైట్ కాల‌ర్ జాబ్‌. చేతినిండా డ‌బ్బులు. వారానికి నాలుగు రోజులే ప‌ని. ఇక మిగిలిన స‌మ‌యం అంతా.. ఖుషీ... ఖుషీ! అంతా బాగానే ఉంది. అసలు స‌మ‌స్య‌.. ఈ ఉద్యోగానికి ధీమా లేక పోవ‌డం. గుండెల‌పై చేయి వేసుకుని నిద్రించే ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌డం. ఉద‌యం ఆఫీసుకు వెళ్లి.. సా యంత్రం తిరిగి వ‌చ్చేలోగా ఎలాంటి వార్త వినిపిస్తుందో.. ఎలాంటి మెసేజ్ క‌నిపిస్తోంద‌న‌న్న బెంగ‌.. బెడ‌ద ఇటీవ‌ల కాలంలో మ‌రింత‌గా పెరిగిపోయింది. నిత్య న‌ర‌కం అనిపించేలా.. ఐటీ ఉద్యోగం దాపురించింది.

తాజాగా ఐటీ రంగంలో ఒక్క ఏప్రిల్ నెల‌లో 21వేల మందిని ఇంటికి పంపించేశారంటే.. ఆశ్చ‌ర్యం వేస్తుంది. ఇలా చేసిన‌వి ఏవో చిన్న సంస్థ‌లు కావు. పెద్ద పెద్ద మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీలు. ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ట‌ర్నో వ‌ర్ ఉన్న కంపెనీలే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఉద్యోగులు గుండెల్లో రైళ్లు పెరిగెడుతుండ‌గా.. బిక్క‌చ‌చ్చి.. బ‌తుకు జీవుడా అంటూ.. కాలం గ‌డుపుతున్నారు. మ‌రీ ముఖ్యంగా ప్ర‌పంచ దేశాల్లో విస్త‌రిస్తున్న టెస్లా కంపెనీ అధినేత, ప్ర‌పంచ కుబేరుడు ఎలాన్ మ‌స్క్ సైతం.. క‌టీఫ్‌లు చెబుతుండ‌డం మ‌రింత ఆశ్చ‌ర్యంగా ఉంది.

ఏప్రిల్‌లో ఉద్యోగాలు తీసేసిన కంపెనీలు.. ఇవీ!

టెస్లా : 14000

జెటిర్‌(ఇది ట‌ర్కీ కంపెనీ) : 6000

ప్ర‌పంచ ప్ర‌సిద్ధ యాపిల్ : 600

ఇదిలావుంటే.. గూగుల్ కంపెనీ కూడా.. ఉద్యోగుల‌ను ఇంటి బాట ప‌ట్టించింది. ఏప్రిల్ 20-30వ తేదీ మ‌ధ్య అంటే ప‌దిరోజుల్లోనే ఏకంగా 200 మంది కీల‌క పోస్టుల్లో(కోటి రూపాయ‌ల ప్యాకేజీ అందుకుంటున్న‌) ఉన్న వారిని తీసి ప‌క్క‌న పెట్టింది. వీరిలో 50 మంది కాలిఫోర్నియా సన్నీవేల్ ఆఫీస్‌లో ప‌నిచేస్తున్న ఇంజినీర్లే కావ‌డం గ‌మ‌నార్హం.

ఎందుకు?

ఉద్యోగాలు తీసివేయ‌డం వెనుక రీజ‌నేంటి? అనే డౌట్ వ‌స్తుంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ రంగం పెరుగుతోంది. మీరు ఎక్క‌డైనా ప‌నిచేసుకోండి... మాకు నాలుగు గంట‌లు ప‌నిచేస్తే చాలు.. ఇంత ఇస్తామ‌నే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ రంగాల దిశ‌గా ప్ర‌ధాన కంపెనీలు పెరుగుతున్నాయి. దీంతో ప‌ర్మినెంట్ ఉద్యోగుల‌ను ప‌క్క‌న పెడుతున్నారు. ఇలా తీసుకుంటున్న వారికి.. స్వ‌ల్ప ప్యాకేజీలు ఇస్తూ.. ప‌ర్మినెంట్ ఉద్యోగుల‌ను తీసేస్తున్నారు. అయితే.. కీల‌క పోస్టుల్లో ఉన్న‌వారికి మాత్రంకొంత వెసులు బాటు ఉన్నా.. వారి జీతాల‌ను త‌గ్గిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీనికి ఆర్తిక మాంద్యం అనే పేరు త‌గిలిస్తున్నారు. యుద్ధాల బూచిని చూపిస్తున్నారు. ఏదేమైనా.. ఐటీ మేటి కాదు.. ఓటి అనేలానే ఉంది ప‌రిస్తితి.