Begin typing your search above and press return to search.

ఎంత మొత్తుకున్నా మారట్లేదు.. కీలక హోదాల్లో ఆమె 10 శాతమే

కంపెనీల్లో బోర్డు ఆఫ్ డైరెక్టర్ల స్థాయిలో మహిళల సంఖ్య ఇరవై శాతం కన్నా తక్కువగానే ఉన్నట్లు గుర్తించారు.

By:  Tupaki Desk   |   20 Dec 2024 4:12 AM GMT
ఎంత మొత్తుకున్నా మారట్లేదు.. కీలక హోదాల్లో ఆమె 10 శాతమే
X

కంపెనీల్లో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవటం మాత్రమే కాదు కీలక హోదాల్లో వారికి చోటు కల్పించేందుకు చట్టాలు అండగా ఉన్నప్పటికి.. ఆ దిశగా పడుతున్న అడుగులు అంతంతమాత్రంగానే ఉన్నాయని చెప్పాలి. దేశీయంగా మొత్తం శ్రామికశక్తిలో మహిళల వాటా ఇరవై శాతం లోపే ఉండటం ఒక ఎత్తు అయితే.. కీలక హోదాల్లో ఉన్న వారి సంఖ్య కేవలం పది శాతంలోపే ఉందన్న విషయం తాజా అధ్యయనం మరోసారి స్పష్టం చేసింది.

కంపెనీల్లో బోర్డు ఆఫ్ డైరెక్టర్ల స్థాయిలో మహిళల సంఖ్య ఇరవై శాతం కన్నా తక్కువగానే ఉన్నట్లు గుర్తించారు. లింగ అసమానతలపై సీఎఫ్ఏ ఇనిస్టిట్యూట్.. సీఎఫ్ఏ సొసైటీ ఇండియా రూపొందించిన రిపోర్టులో ఈ ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 300కంపెనీలు తమ బిజినెస్ రెస్పాన్సిబిలిటీ.. సస్టైనబిలిటీ రిపోర్టులలో వెల్లడించిన వివరాల ఆధారంగా ఈ రిపోర్టును రూపొందించారు. కంపెనీల్లోని అత్యున్నత స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యాన్నిపెంచేందుకు వీలుగా నిబంధనలు తెచ్చిన పెద్దగా మార్పు లేదనే చెప్పాలి.

ఈ నివేదిక ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళా బోర్డు మెంబర్లు.. కేఎంపీలకు అతి తక్కువ ప్రతిఫలం దక్కుతోందని.. మహిళా డైరెక్టర్లకు లభించే ప్రతిఫలం.. పురుష డైరెక్టర్ల వేతనాల్లో సగటున 44 శాతమే ఉంటోందని తేల్చారు. అంతేకాదు పురుష కేఎంపీలతో పోలిస్తే మహిళా కేఎంపీల జీతభత్యాలు 25 శాతం కంటే తక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు.

రిపోర్టులో పేర్కొన్న మరిన్ని అంశాల్ని చూస్తే..

- ఐటీ రంగంలో అత్యధికంగా 34 శాతం మహిళలు ఉన్నారు.

- తర్వాతి స్థానాల్లో నిత్యావసరయేతర ఉత్పత్తులు.. సేవల రంగం (25 శాతం)

- ఆర్థిక రంగం (24 శాతం)

- యుటిలిటీస్ రంగం (4 శాతం)

- కంపెనీల్లో బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ విషయానికి వస్తేరియల్ ఎస్టేట్.. ఐటీ.. నిత్యవసరాలు.. ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల్లో లింగ సమానత్వం మరింత మెరుగ్గా ఉంది.

- ఆర్థిక.. ఎనర్జీ రంగాల్లో లింగ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి.