Begin typing your search above and press return to search.

లేఆఫ్ లకు త్వరలో బై బై... ఏయే రంగాలకు గుడ్ న్యూస్ అంటే..?

తాజాగా ఆ సంస్థ చేపట్టిన సర్వేలో వచ్చే ఏడాది మార్చి తర్వాత పలు కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను పెంచనున్నాయని తెలిపింది.

By:  Tupaki Desk   |   13 Dec 2023 3:00 AM GMT
లేఆఫ్  లకు త్వరలో బై బై... ఏయే రంగాలకు గుడ్  న్యూస్  అంటే..?
X

దేశంలో గతంలో ఆర్ధిక మాధ్యం ఇటీవల కోవిడ్ అనంతరం లేఆఫ్ లపై విపరీతమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా లేఆఫ్ ల భయం ఉద్యోగులను వెంటాడుతున్న వేల ఒక గుడ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది పలు కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను పెంచనున్నాయని తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా ఉద్యోగులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

అవును... దేశంలో లే ఆఫ్స్ భయం ఉద్యోగులను వెంటాడుతున్న వేళ టీం లీజ్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆ సంస్థ చేపట్టిన సర్వేలో వచ్చే ఏడాది మార్చి తర్వాత పలు కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను పెంచనున్నాయని తెలిపింది. ఇదే సమయంలో మరికొన్ని కంపెనీలు లే ఆఫ్స్ జోలికి పోకుండా ఉన్న ఉద్యోగులను కొనసాగనించనున్నాయని చెబుతుంది.

ఈ క్రమంలో ఆ సంస్థ 14 నగరాల్లో 22 రంగాలకు చెందిన 1,820 కంపెనీలపై సర్వే చేసినట్లు తెలుస్తుంది. ఇలా సర్వే చేసిన 1,820 కంపెనీల్లోనూ సుమారు 79శాతం కంపెనీలు మరో ఆరునెలల్లో నియామకాలు పెంచాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఇందులో ప్రధానంగా హెల్త్‌ కేర్, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో 86శాతం.. ఎలక్ట్రిక్ వాహనాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి పరిశ్రమల్లో 85శాతం మేర గణనీయమైన శ్రామికశక్తి విస్తరణను చూస్తున్నాయని చెబుతుంది.

ఇదే సమయంలో నగరాల వారీగా చూస్తే... బెంగుళూరులో అత్యధికంగా 89%, చెన్నైలో 83%, ముంబైలో 82% వర్క్‌ ఫోర్స్ విస్తరణ రేటు అత్యధికంగా ఉందని నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో కొత్త నియామకాల విషయంలో... బెంగళూరు 87% వద్ద, ముంబై 86%, చెన్నై 83% వద్ద తన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.

అదేవిధంగా... కోయంబత్తూర్, గుర్గావ్, కొచ్చి, నాగ్‌ పూర్, చండీగఢ్, ఇండోర్ వంటి టైర్-2 నగరాలు కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయని టీం లీజ్ సంస్థ తన సర్వే ఫలితాల్లో వెల్లడించింది.