ఒక్కో ఉద్యోగి జీతం కోట్లలో..గూగుల్ లో జీతాల లెక్కలివి!
ఈ నేపథ్యంలో తాజాగా లీక్ అయిన ఒక డేటా ప్రకారం, గూగుల్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్యాకేజ్ వివరాలు వెల్లడయ్యాయి.
By: Tupaki Desk | 21 July 2023 11:56 AM GMTప్రపంచంలో ఎక్కువ జీతాలు అందుకునే వారిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అని, అందించే సంస్థల్లో గూగుల్ ఒకటనేది తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో తాజాగా లీక్ అయిన ఒక డేటా ప్రకారం, గూగుల్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్యాకేజ్ వివరాలు వెల్లడయ్యాయి.
అవును... ప్రపంచంలో అత్యధిక వేతనాలు ఇచ్చే కంపెనీల్లో గూగుల్ తాజాగా మొదటిస్థానంలో నిలిచిందని తెలుస్తుంది. ఇదే సమయంలో ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా రెండో ప్లేస్ లో ఉండగా.. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ మూడో స్థానంలో ఉందని అంటున్నారు.
నివేదికల ప్రకారం, గూగుల్ సంస్థ తన ఉద్యోగుల సగటు వేతనం 2022లో సుమారు 2,79,802 డాలర్లు అని తెలిసింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఒక్కో ఉద్యోగి సుమారు రూ. 2.30 కోట్లు వేతనంగా పొందుతున్నట్లు సమాచారం.
అదే సమయంలో 2022లో గరిష్ట ప్రాధమిక జీతం 7,18,000 డాలర్లుగా ఉంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 5.90 కోట్లు. అంటే ఉద్యోగి గరిష్ట వార్షిక వేతనం సుమారు రూ. 6 కోట్లు వరకు ఉంటుందన్నమాట.
ఇలా గూగుల్ లో అత్యధిక జీతాలు తీసుకునే వివిధ రకాల కేటగిరీలు కూడా వెలుగులోకి వచ్చాయి. వీటిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు మొదటి స్థానంలో ఉండగా.. ప్రోగ్రాం మేనేజర్లు టాప్ 10 లో చివరి స్థానంలో ఉన్నారు.
గూగుల్ లో అత్యధిక జీవితలు తీసుకునే ఉద్యోగుల కేటగిరీలు.. వారి జీతం డాలర్లు, రూపాయిల్లో ఇలా ఉంది.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్: 7,18,000 డాలర్లు (రూ. 5.90 కోట్లు)
ఇంజినీరింగ్ మేనేజర్: 4,00,000 డాలర్లు (రూ. 3.28 కోట్లు)
ఎంటర్ ప్రైజ్ డైరెక్ట్ సేల్స్: 3,77,000 డాలర్లు (రూ. 3.09 కోట్లు)
లీగల్ కార్పొరేషన్ కౌన్సిల్: 3,20,000 డాలర్లు (రూ. 2.62 కోట్లు)
సేల్స్ స్ట్రాటజీ: 3,20,000 డాలర్లు (రూ. 2.62 కోట్లు)
యుఎక్స్ డిజైన్: 3,15,000 డాలర్లు (రూ. 2.58 కోట్లు)
గవర్నమెంట్ అఫైర్స్ & పబ్లిక్ పాలసీ: 3,12,000 డాలర్లు (రూ. 2.56 కోట్లు)
రీసర్చ్ సైంటిస్ట్: 3,09,000 డాలర్లు (రూ. 2.53 కోట్లు)
క్లౌడ్ సేల్స్: 3,02,000 డాలర్లు (రూ. 2.47 కోట్లు)
ప్రోగ్రాం మేనేజర్: 3,00,000 డాలర్లు (రూ. 2.46 కోట్లు)