Begin typing your search above and press return to search.

త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన టాప్ ఐటీ సంస్థలు... తెరపైకి షాకింగ్ విషయాలు!

అవును... ఐటీ సహా ఇతర రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   22 July 2023 10:31 AM GMT
త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన  టాప్  ఐటీ సంస్థలు... తెరపైకి షాకింగ్ విషయాలు!
X

ప్రస్తుతం ప్రముఖ ఐటీ సంస్థల్లో లే ఆఫ్ ల సీజన్ నడుస్తుందనే కథనాలు నిత్యం ఏదో ఒకమూల వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దేశంలోని టాప్ ఐటీ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గినట్లు తెలుతుంది. ఈ మేరకు టీసీఎస్, ఇన్ ఫోసిస్ వంటి కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య ఘణనీయంగా తగ్గిందని తెలుస్తుంది.

అవును... ఐటీ సహా ఇతర రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా... దేశీయ టెక్ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ లు 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్ - జూన్) ఫలితాలను ఇప్పటికే ప్రకటించాయి. ఫలితంగా... గత మూడు నెలల్లో కంపెనీ ఆదాయం, పెర్ఫామెన్స్ వివరాలను వెల్లడించాయి.

దీంతో ఈ రెండు టాప్ కంపెన్లీలో సిబ్బందితో పాటు, కొత్త నియామకాలు భారీగా తగ్గడం ఆందోళన కలిగిస్తోందని తెలుస్తుంది. దీంతో దేశ జీడీపీలో సుమారు 8 శాతం వాటా కలిగి ఉన్న ఐటీ పరిశ్రమలో ఈ తాజా పరిస్థితి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.

ఈ ఫలితాల్లో టీసీఎస్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కేవలం 523 మంది ఉద్యోగులనే కొత్తగా చేర్చుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో 14,136 మందిని కొత్తగా చేర్చుకుంది. దీంతో గతేడాదితో పోల్చితే ఈ సంఖ్య ఏకంగా 96 శాతం తక్కువ కావడం గమనార్హం.

ఇదే సమయంలో టీసీఎస్ తర్వాత రెండో అతిపెద్ద దేశీయ ఐటీ సంస్థగా ఉన్న ఇన్పోసిస్ కూడా తొలి త్రైమాసక ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాల్లో గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే సిబ్బంది సంఖ్య 6,940 తగ్గినట్లు పేర్కొంది. మార్చి త్రైమాసికంలోనూ సిబ్బందిలో 3,611 మంది తగ్గడం గమనార్హం.

ఇలా దిగ్గజ సంస్థల్లో నియామకాలు తగ్గడంతో పాటు, ఉన్న ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారనే కథనాలు వస్తుండటంతో... ఐటీ ఇండస్ట్రీలో మాంద్యం రాబోతుందా అనే భయాలు మొదలయ్యాయని తెలుస్తుంది. అయితే ఇలా టాప్ కంపెనీలతో పాటు మిగిలిన కంపెనీలు కూడా ఇదే ట్రెండ్ ను కొనసాగిస్తే మాంద్యం రావచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయని అంటున్నారంట నిపుణులు!