Begin typing your search above and press return to search.

ఓ మై గాడ్... ఇండియాలో ఇన్నిలేఆఫ్ లా?

రంగం ఏదైనా.. ఉద్యోగం మరేదైనా.. ఈ మధ్యకాలంలో అనిశ్చిత ఆర్ధిక పరిస్థితుల కారణంగా లేఆఫ్‌ ల మాటలు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 Sep 2023 11:30 PM GMT
ఓ మై గాడ్... ఇండియాలో ఇన్నిలేఆఫ్ లా?
X

రంగం ఏదైనా.. ఉద్యోగం మరేదైనా.. ఈ మధ్యకాలంలో అనిశ్చిత ఆర్ధిక పరిస్థితుల కారణంగా లేఆఫ్‌ ల మాటలు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోగా.. భారత్‌ లోనూ వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చిన వీరి లెక్కలు విస్తుగొలిపేలా ఉన్నాయి.

అవును... ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్న మాట... లేఆఫ్. ఈ క్రమంలో టెక్ ఫోకస్డ్ హైరింగ్ సంస్థ టాప్‌ హైర్‌ తాజాగా ఒక డేటా విడుదల చేసింది. ఈ డేటాలో ఇప్పటివరకూ ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారనే విషయంపై వివరాలు వెల్లడించింది.

ఈ లెక్కల ప్రకారం... గత రెండేళ్లలో భారతదేశంలో దాదాపు లక్షమంది ఉద్యోగాలు కోల్పోయారని టాప్ హైర్ ఆ సంస్థ పేర్కొంది. “లేఆఫ్స్‌ డాట్‌ ఫై” లెక్కల ప్రకారం... 2021 సెప్టెంబర్ 1 నుంచి ఇండియాలో సుమారు 27,850 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే టెక్‌ హైర్‌ సంస్థ నివేదించిన దానిలో ఇది సుమారు మూడింట ఒక వంతు మాత్రమే.

అయితే ఈ విషయంపై టెక్ హైర్ వివరణ ఇచ్చింది. పబ్లిక్ గా ఉన్న వివరాలు మాత్రమే లేఆఫ్స్ డాట్ ఫై నివేధించి ఉండవచ్చు... సైలెంట్‌ లేఆఫ్‌ లు, బలవంతపు రాజీనామాల కారణంగా లెక్కల్లో ఈ భారీ వ్యత్యాసం ఉందని టెక్‌ హైర్‌ నివేదిక పేర్కొంది!

ఈ లేఆఫ్ లలోలో ప్రత్యేకంగా ఎడ్ టెక్ రంగానికి సంబంధించిన ఉద్యోగులే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా లేఆఫ్స్‌ డాట్‌ ఫై డేటా ప్రకారం.. భారతదేశంలో గత రెండు సంవత్సరాలలో నమోదైన మొత్తం తొలగింపులలో బైజూస్‌, అనకాడమీ, వేదాంతు, అప్‌ గ్రేడ్‌ వంటి కంపెనీలు 10,679 మందిని తొలగించాయి.

ఈ ఎడ్ టెక్ రంగం తర్వాత స్థానాల్లో రిటైల్, ఈ-కామర్స్ రంగాలు ఉన్నాయని అంటున్నారు. ఈ రంగాల్లో గత రెండేళ్లలో అత్యధిక లేఆఫ్‌ లు అధికంగా నమోదయ్యాయని లేఆఫ్స్ డాట్ ఫై వివరాలు అందిస్తుంది.

వీటిలో... మింత్రా, మీషో, మమాఎర్త్‌, ఫ్లిప్‌ కార్ట్‌, ఉడాన్‌, దుకాణ్‌ వంటి సంస్థలు సుమారు 3,400 మందిని తొలగిచాయని సంస్థ తెలిపింది. ఇదే క్రమంలో... ఫుడ్ డెలివరీ, క్విక్‌ కామర్స్‌ రంగాలలో కూడా సుమారు 3,190 ఉద్యోగాల కోతలు విధించబడ్డాయని తెలుస్తుంది.

ఇలా భారీగా లే ఆఫ్ లకు పాల్పడిన రంగాల్లో... ఎడ్ టెక్ మొదటి స్థానంలో ఉండగా... రిటైల్, ఈ-కామర్స్ లు రెండో స్థానంలో నిలిచాయి. ఇదే సమయంలో ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ రంగాలు మూడో స్థానంలో నిలిచాయి.