Begin typing your search above and press return to search.

టైమ్ వచ్చింది... జాబ్ సీకర్స్ కి ఇండియన్ ఐటీ కంపెనీల గుడ్ న్యూస్!

గత కొంతకాలంగా ఐటీ కంపెనీల్లో తగ్గుతున్న ఉద్యోగుల సంఖ్యల గురించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   21 Oct 2024 7:30 AM GMT
టైమ్  వచ్చింది... జాబ్  సీకర్స్  కి ఇండియన్  ఐటీ కంపెనీల గుడ్  న్యూస్!
X

గత కొంతకాలంగా ఐటీ కంపెనీల్లో తగ్గుతున్న ఉద్యోగుల సంఖ్యల గురించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. గత ఆరు ఏడు త్రైమాసికాల్లో ఇదే పరిస్థితి. దీంతో.. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో అని.. అసలు తమకు కొలువులు ఎప్పుడొస్తాయనే ఆందోళనలో ఉద్యోగార్థులు ఉండేవారు! అయితే తాజాగా గుడ్ న్యూస్ వచ్చింది.

అవును... గత కొంతకాలంగా దేశంలోని టాప్ ఐటీ కంపెనీలు వెళ్లడిస్తున్న ఆర్థిక ఫలితాల్లో నికర ఉద్యోగుల సంఖ్య తగ్గడమే తప్ప పెరిగిన దాఖలలు కనిపించలేదనే చెప్పాలి. దీంతో... ఆ రంగంలోకి వెళ్లాలని ఎదురుచూస్తున్న జాబ్ సీకర్స్ కి ఈ ఫలితాలు తీవ్ర ఆందోళన, నిరాశ కలిగించేవి. అయితే తాజా ఫలితాలు అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.

ఇందులో భాగంగా... భారతదేశంలోని టాప్ ఐటీ కంపెనీలు తాజాగా ప్రకటించిన జూలై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో ఊద్యోగుల సంఖ్య పెరిగినట్లు వెల్లడించాయి! ఇదే సమయంలో... ఉత్తీర్ణుల ఎంపికలోనూ ప్రణాళిక మేరకు చేపడుతున్నామని ఆయా యాజమాన్యాలు ప్రకటించడం జాబ్ సీకర్స్ ఆశలు చిగురింపచేశాయనే చెప్పాలి.

ఈ క్రమంలో... ఇప్పటివరకూ ఫలితాలు ప్రకటించిన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్ర, ఎల్టీఐ మైండ్ ట్రీ కంపెనీలు కలిపి 17,500 కొత్త రిక్రూట్ మెంట్స్ జరిపినట్లు వెల్లడించాయి. ఇందులో టీసీఎస్ - 5726, ఇన్ఫోసిస్ - 2456, విప్రో - 978, టెక్ మహేంద్ర - 6653, ఎల్టీఐ మైండ్ ట్రీ - 2504 మందిని రిక్రూట్ చేసుకున్నాయి.

ఇదే సమయంలో... క్యాంపస్ ఇంటర్వూలు చేసి, గతంలో ఆఫర్ లెటర్స్ ఇచ్చిన అందరినీ తప్పనిసరిగా జాయిన్ చేసుకుంటున్నట్లు సంస్థలు ప్రకటించాయి. కాకపోతే హెచ్.సీ.ఎల్. టెక్ లో మాత్రమే 780 మంది ఉద్యోగులు తగ్గారు. అమెరికా సంయుక్త సంస్థ నుంచి విడిపోవడమే దీనికి కారణమని అంటున్నారు.

ఈ సందర్భంగా... కొత్త ఆర్డర్స్ పైనా కంపెనీలు ఆశావహంగా ఉన్నాయి. ఇదే సమయంలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల్లోనూ ఆర్డర్లు వస్తున్నట్లు వెల్లడించాయి! ఏది ఏమైనా ఐటీ కొలువుల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది కచ్చితంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.