బుక్స్ చదివి అల్లుడి హత్య... అత్తగారి షాకింగ్ నిర్వాకం!
అవును... మాగడి రియల్టర్ లోకనాథ్ సింగ్ (37) హత్య కేసు విషయంలో అతని భార్య, అత్తలను బెంగళూరు బీజీఎస్ లేఔట్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 27 March 2025 8:30 AMఇటీవల కాలంలో హత్య చేయడం చాలా చిన్న విషయంగా మారిపోయిందా.. లేక, ప్రతీ సమస్యకు మనిషిని శాస్వతంగా 'తప్పించడమే' అనే ఆలోచనా ధోరణి పెరిగిందా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. తాజాగా బెంగళూరు నగర శివార్లలో జరిగిన రియల్టర్ హత్య కేసులో వెలుగులోకి వచ్చిన విషయాలు షాకింగ్ మారాయి.
అవును... మాగడి రియల్టర్ లోకనాథ్ సింగ్ (37) హత్య కేసు విషయంలో అతని భార్య, అత్తలను బెంగళూరు బీజీఎస్ లేఔట్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు షాకింగ్ విషయాలు తెరపైకి వచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... పక్కా ప్లాన్ ప్రకారం లోకనాథ్ సింగ్ ని హత్య చేసినట్లు చెబుతున్నారు.
ఈ సందర్భంగా... ఆల్లుడి వేధింపులు తట్టుకోలేక అని ఒకరు, అల్లుడంటే పడక ఈ నిర్ణయం అని మరొకరు చెబుతోన్న వేళ... లోకనాథ్ సింగ్ అత్త హేమబాయి (37), ఆమె కుమార్తె యశస్వీ సింగ్ (19).. పుస్తకాలు చదివి, ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి మరీ ఓ పథకం ప్రకారం హత్య చేశారని తెలుస్తోంది.
దీనికోసం "హౌ టు కిల్" పుస్తకం చదివిన హేమ.. అల్లుడికి భోజనంలో నిద్రమాత్రలను కలపాలని కూతురికి సూచించిందని విచారణలో తేలినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా... నిర్మాణంలో ఉన్న భవనంలో మద్యం తాగించి, మందు కలిపిన ఆహారం తినిపించిన తర్వతా.. భార్య, అత్త కలిసి గొంతు కోసి హతమార్చినట్లు చెబుతున్నారు.
అయితే... ఈ స్థాయి నిర్ణయం తీసుకోవడానికి లోకనాథ్ సింగ్ ప్రవర్తనే కారణం అని విచారణలో తేలినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. భార్య ప్రైవేటు వీడియోను అడ్డుపెట్టుకుని, తాను మరో మహిళను పెళ్లి చేసుకుంటానని భార్య, అత్తకు చెప్పేవాడని, అది తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నారని విచారణలో తేలిందని చెబుతున్నారు.