Begin typing your search above and press return to search.

100 ఇజ్రాయెల్ జెట్లు.. 2 వేల కి.మీ ప్రయాణం.. ఇరాన్ పై నిప్పుల వాన

మధ్యలో ఇరాన్ అణు కేంద్రాలపైనా ఇజ్రాయెల్ దాడులు చేస్తుందనే ఊహాగానాలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   26 Oct 2024 12:29 PM GMT
100 ఇజ్రాయెల్ జెట్లు.. 2 వేల కి.మీ ప్రయాణం.. ఇరాన్ పై నిప్పుల వాన
X

హెజ్బొల్లా నాయకుడు నస్రల్లా హత్యకు ప్రతీకారంగా ఈ నెల 1న ఇజ్రాయెల్‌ పై ఇరాన్‌ క్షిపణులతో విరుచుకుపడింది. 400 క్షిపణులు ప్రయోగించినట్లు కథనాలు వచ్చినా.. అవి 200 లోపేనని తేలింది. అయితే, వీటిలో చాలావరకు క్షిపణులను ఇజ్రాయెల్ అడ్డుకుంది. ఈ నేపథ్యంలోనే తాము సైతం ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు హెచ్చరించారు. కానీ, 25 రోజులవుతున్నా ఎలాంటి స్పందనా లేదు. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకారం మర్చిపోయిందేమో అనుకున్నారు. మధ్యలో ఇరాన్ అణు కేంద్రాలపైనా ఇజ్రాయెల్ దాడులు చేస్తుందనే ఊహాగానాలు వచ్చాయి. అమెరికా అడ్డు చెబుతోందంటూ కథనాలు వచ్చాయి. కానీ, తమకు జరిగిన దానికి బదులు తీర్చుకోకుంటే అది ఇజ్రాయెల్ ఎందుకు అవుతుంది...?

తెల్లవారుతూనే..

ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా శనివారం తెల్లవారుజాము నుంచి ఇరాన్ కొన్ని గంటల పాటు దాడులు చేసింది. ఈ నెల 7 నుంచి ఇజ్రాయెల్‌ పై కనికరం లేకుండా దాడులు చేస్తున్నదానికి ఇది ప్రతీకారమని పేర్కొంది. ఇరాన్‌ సైనిక స్థావరాలతో పాటు క్షిపణి, డ్రోన్‌ తయారీ కేంద్రాలపై ఈ దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ నుంచి 2 వేల కిలోమీటర్లు ప్రయాణించిన 100 యుద్ధ విమానాలతో 20 లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. అయితే ఇజ్రాయెల్ దాడులు ముగిసినట్లు ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో అమెరికా పాల్గొనండం లేదని ఆ దేశం తెలిపింది. కాకపోతే ఈ దాడుల సమాచారం ముందే అందించినట్లు తెలుస్తోంది. తమ ఇద్దరు సైనికులు మృతి చెందినట్లు ఇరాన్ తాజాగా వెల్లడించింది. టెహ్రాన్‌ లోని 20 లక్ష్యాలపై ఇజ్రాయెల్‌ దాడులకు పాల్పడినట్లు సమాచారం. వీటిలో డ్రోన్‌ ఫ్యాక్టరీలు, బాలిస్టిక్‌ క్షిపణి తయారీ, ప్రయోగ కేంద్రాలు ఉన్నాయి. దక్షిణ టెహ్రాన్‌ లోని ఓ డ్రోన్‌ ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసమైంది.

గగనతలం బంద్..

ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో ఇరాక్‌ విమానాశ్రయాల్లో రాకపోకలను నిలిపివేసింది. ఇరాన్‌ కూడా తమ దేశంలో విమానాల రాకపోకలను బంద్ చేసింది. ఇజ్రాయెల్ దాడులను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధికారిక వార్తా సంస్థ తన్సీమ్ నిర్ధారించింది. రాజధాని టెహ్రాన్ సమీపంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని తెలిపింది. దీంతో ఇజ్రాయెల్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి సమాయాత్తం అవుతోంది. తదుపరి ఆదేశాల వరకు విమాన సర్వీసులను పునరుద్ధరించకూడదని ఇరాన్ నిర్ణయించింది.

గల్ఫ్ దేశాల స్పందన ఏమిటో?

ఇజ్రాయె ప్రతీకారం దాడులను గల్ఫ్ లో ముఖ్య దేశమైన సౌదీ అరేబియా ఖండించింది. పశ్చిమాసియాలో ఘర్షణలు మరింత తీవ్రం కావడంపై ఆందోళన వ్యక్తంచేసింది. దీనిని ఆమోదించబోమని తెలిపింది. ఇజ్రాయెల్‌ దాడులను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ (యూఏఈ) కూడా ఖండించింది. ఈ ఘర్షణల కారణంగా ప్రాంతీయ భద్రత, స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్రిక్తతలు మరింత తీవ్రంగా కాకుండా సంయమనం పాటించాలని కోరింది.