Begin typing your search above and press return to search.

కొత్త చట్టం... తప్పుడు వాగ్దానంతో పెళ్లి చేసుకుంటే పదేళ్ల జైలు శిక్ష!

బ్రిటిష్‌ హయాం నుంచి అమల్లో ఉన్న భారత శిక్షాస్మృతి నేర శిక్షాస్మృతి సాక్ష్యాధార చట్టాల స్థానంలో నూతన శాసనాలను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది

By:  Tupaki Desk   |   12 Aug 2023 8:33 AM GMT
కొత్త చట్టం... తప్పుడు వాగ్దానంతో పెళ్లి చేసుకుంటే పదేళ్ల జైలు శిక్ష!
X

బ్రిటిష్‌ హయాం నుంచి అమల్లో ఉన్న భారత శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీ.ఆర్‌.పీ.సీ), సాక్ష్యాధార చట్టాల స్థానంలో నూతన శాసనాలను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది! ఇందులో భాగంగా... భారతీయ న్యాయ సంహిత (బీ.ఎన్‌.ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీ.ఎన్‌.ఎస్‌.ఎస్‌.), భారతీయ సాక్ష్యా (బీ.ఎస్‌.).. పేరుతో మూడు కొత్త బిల్లులను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

1860 నాటి భారత శిక్షాస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌ సభలో ప్రవేశపెట్టారు. ఇందులో మహిళలపై నేరాలకు సంబంధించిన నిబంధనలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గుర్తింపును దాచిపెట్టి యువతిని వివాహం చేసుకోవంటం వంటి నేరాలకు ఇకపై 10 ఏళ్ల వరకు శిక్ష పడే విధంగా నింబంధనలను పొందుపరిచారు.

ఇదే క్రమలో... ఉద్యోగం, పదోన్నతి వంటి తప్పుడు వాగ్దానంతో మహిళను వివాహమాడినా లేదా లైంగిక చర్యలకు పాల్పడినా పదేళ్ల వరకు శిక్ష పడే విధంగా నూతనంగా తీసుకువచ్చిన న్యాయ చట్టాల్లో నిబంధనలు పొందుపరిచారు. ఉద్యోగం, పదోన్నతి, వివాహం వంటి అంశాల్లో తప్పుడు వాగ్దానాలతో స్త్రీతో లైంగిక చర్యను అత్యాచారంగా పరిగణించలేదు కానీ పదేళ్ల వరకు శిక్ష ఉంటుందని స్టాండింగ్ కమిటీ పేర్కొంది.

ఇదే సమయంలో ఈ కొత్త న్యాయ చట్టాల ప్రకారం గ్యాంగ్‌ రేప్ నేరంలో దోషికి 20 ఏళ్ల శిక్ష పడుతుంది. అత్యాచారంలో బాధితురాలు మరణిస్తే.. 20 ఏళ్లకు తగ్గకుండా శిక్ష, జీవితకాలం లేదా మరణశిక్ష పడే అవకాశాలను చట్టంలో సూచించారు. 18 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే మరణిశిక్ష ఉంటుంది. 12 ఏళ్లలోపు బాలలపై రేప్ ఘటనల్లోనూ ఇదే తరహా శిక్షలు అమల్లోకి వస్తాయి.

ఇక లైంగిక హింస కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని.. ఆమె ఇంట్లోనే మహిళా పోలీసు అధికారి ఆధ్వర్యంలో, మహిళా మేజిస్ట్రేట్‌ ద్వారా నమోదుచేస్తారు. ఆ సమయంలో బాధితురాలి తల్లిదండ్రులు, సంరక్షకులు ఉండొచ్చు. పిల్లలపై నేరాలు చేసేవారికి శిక్షను 7 నుంచి 10 ఏళ్లకు చేర్చారు. జరిమానానూ భారీగా పెంచారు!

కాగా... ఐపీసీలో 511 సెక్షన్లు ఉన్నాయి. దాని స్థానంలో తీసుకొచ్చే బీ.ఎన్‌.ఎస్‌ లో 356 మాత్రమే ఉంటాయి. బీ.ఎన్‌.ఎస్‌. రూపకల్పనలో భాగంగా ఐపీసీలో 22 సెక్షన్లు రద్దు చేశారు. కొత్తగా ఎనిమిదింటిని చేర్చారు. ఇదే సమయంలో 175 సెక్షన్లలో మార్పులు చేశారు. ఐపీసీలో 302గా ఉన్న హత్యానేరం బీ.ఎన్‌.ఎస్‌. లో 99 సెక్షన్‌ కింద ఉండనుంది!