ఢిల్లీ స్కూల్స్ కు బెదిరింపులు... ఎవరో, ఎందుకో తెలిస్తే షాకే?
ఈ క్రమంలోనే శుక్రవారం కూడా పశ్చిమ విహార్ లోగల డీపీఎస్, కేంబ్రిడ్జ్ స్కూల్స్ కు బెదిరింపులు వచ్చాయి.
By: Tupaki Desk | 14 Dec 2024 1:39 PM GMTఇటీవల కాలంలో ఢిల్లీలో స్కుల్స్ కి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... శుక్రవారం పశ్చిమ విహార్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కుల్స్ తో పాటు పలు విద్యాసంస్థలకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే... ఈ పనికి పాల్పడుతున్న వ్యక్తిని గుర్తించారు.
అవును... గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని పలు స్కూల్స్ కి బెదిరింపు కాల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా పశ్చిమ విహార్ లోగల డీపీఎస్, కేంబ్రిడ్జ్ స్కూల్స్ కు బెదిరింపులు వచ్చాయి. దీంతో... రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో.. ఆ బెదిరింపు కాల్స్ చేసింది 12 ఏళ్ల విద్యార్థి అని గుర్తించారు.
ఈ సమయంలో ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో.. ఢిల్లీలోని పలు స్కూల్స్ కు బాంబు బెదిరింపులు వస్తున్నాయని కథనాలు చూసి తాను ఈ పని చేసినట్లు బాలుడు వెల్లడించాడని పోలీసు వర్గాలు తెలిపాయని తెలుస్తోంది. ఇదే సమయలో ఈ పని చేయడానికి బాలుడు చెప్పిన కారణం షాకింగా మారిందని అంటున్నారు.
ఇందులో భాగంగా.. స్కూల్స్ ని ఎన్ని బెదిరింపులు వస్తున్నప్పటికీ ఆ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు పట్టుకోవడం లేదన్న ఆవేదనతోనే తాను ఈ పనికి పాల్పడినట్లు పేర్కొన్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు బాలుడితో సహా అతడి తల్లితండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
మరోవైపు శనివారం కూడా స్కూల్స్ కు బెదిరింపులు వచ్చాయి. ఇందులో భాగంగా... ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తో సహా పలు విద్యాసంస్థలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని అంటున్నారు. దీంతో... అగ్నిమాపక సిబ్బంది, బాంబు స్క్వాడ్ అక్కడకు చేరి తనిఖీలు నిర్వహించారు.
అయితే అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో... ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా... డిసెంబర్ 9న కూడా 40కి పైగా స్కూళ్లకు ఈ తరహా బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పాఠశాల ఆవరణల్లో పేలుడు పదార్థాలను అమర్చామని బెదిరింపులు వచ్చాయి.. అయితే అది నకిలీదని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది! అయితే... తాజాగా 12 ఏళ్ల విద్యార్థి బెదిరింపులకు పాల్పడ్డాడనే విషయం వైరల్ గా మారింది.