120 మంది కవల పిల్లలతో ఆ స్కూల్ కళకళ...!
సాధారణంగా ఏ స్కూల్ తీసుకున్నా, కాలేజ్ తీసుకున్నా ఒక కవల జంట లేదా రెండు కవల జంటలు ఉండటం మనం చూస్తూ ఉంటాం.
By: Tupaki Desk | 10 Nov 2024 2:30 PM GMTసాధారణంగా ఏ స్కూల్ తీసుకున్నా, కాలేజ్ తీసుకున్నా ఒక కవల జంట లేదా రెండు కవల జంటలు ఉండటం మనం చూస్తూ ఉంటాం. కానీ అయిదు కాదు, పది కాదు ఏకంగా 60 కవల జతలను ఒకే సారి, ఒకే స్కూల్‌లో చూడటం సాధ్యమా అంటే ఎవరైనా అసాధ్యం అనేస్తారు. కానీ పంజాబ్‌లోని జలంధర్‌లో పోలీస్ డీఏవీ పబ్లిక్ స్కూల్ కి వెళ్తే ఎక్కడ చూసినా కవల పిల్లలే కనిపిస్తారు. ఒకరిని పోలిన వారు మరొకరు అక్కడ అడుగు అడుగున కనిపిస్తారు. ఎందుకంటే ఆ స్కూల్ లో ఏకంగా 120 మంది కవల పిల్లలు చదువుకుంటున్నారు. ఇది వరల్డ్ రికార్డ్‌గా ఆ స్కూల్ యాజమాన్యం చెబుతోంది.
ప్రతి క్లాస్‌లోనూ కవల బ్రదర్స్ లేదా సిస్టర్స్ ఉంటారు. వారిని ఆ స్కూల్ టీచర్స్ సైతం గుర్తించలేనంతగా సేమ్ ఉంటారు. ఆ స్కూల్ కి ఆ రాష్ట్రంలోనే కవల పిల్లలు ప్రాముఖ్యతను తీసుకు వచ్చారు. దేశంలో మరెక్కడ లేని విధంగా ఆ ఒక్క స్కూల్ లోనే 60 జతల కవల పిల్లలు అంటే 120 మంది కవలలు చదవడం వెనుక ఉన్న కారణం ఏంటో అంటూ ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎవరికి వారు ఏదో కారణం చెబుతున్నప్పటికీ స్కూల్ యాజమాన్యం మాత్రం పిల్లల తల్లిదండ్రులకు మాపై ఉన్న నమ్మకం కారణంగానే ఈ స్థాయిలో కవలలు మా స్కూల్ లో జాయిన్ అయ్యారని అంటున్నారు.
కొన్ని చోట్ల జెన్యు ప్రభావం వల్ల ఎక్కువగా కవల పిల్లలు పుడుతూ ఉంటారు. ఆ ప్రాంతాంలో కవల పిల్లలు ఎక్కువ పుట్టడం వల్ల అదే స్కూల్ కు ఎక్కువ మంది పంపించడం వల్ల ఆ స్కూల్ కి రికార్డ్ దక్కిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో పంజాబ్‌లోని జలంధర్ లో ఉన్న పోలీస్ డీఏవీ పబ్లిక్ స్కూల్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతూ ఉంటుంది. తద్వార ముందు ముందు మరింత మంది కవల పిల్లలను సైతం అదే స్కూల్ కు చేర్చే అవకాశాలు ఉంటాయి. స్థానికంగా ఎవరికి కవల పిల్లలు పుట్టినా అక్కడికే తీసుకు వెళ్లాలనే ఒక అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఆ స్కూల్ లో కేవలం కవల పిల్లలు మాత్రమే కాకుండా ముగ్గురు జన్మించిన వారు సైతం ఉన్నారు. అంటే ట్రిప్లెట్స్ కూడా ఆ స్కూల్ లో ఉండటం విశేషం. ముందు ముందు ఇదే విధంగా రికార్డ్ కంటిన్యూ అవ్వాలంటే మరింత మంది కవల పిల్లలు జన్మించి ముందు ముందు వారు సైతం అదే స్కూల్ లో జాయిన్ అయితే రికార్డ్ కంటిన్యూ అవుతుంది. మరి స్థానికంగా కవల పిల్లల పుట్టుక అనేది అదే విధంగా కంటిన్యూ అవుతుందా అనేది తెలియాలి అంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.