పంజాబ్ లో 120 ఏళ్లు దాటిన ఓటర్లు ఎందరున్నారో తెలుసా?
ప్రపంచంలోనే అనేక జబ్బులకు చికిత్సలు రావడంతో చాలా మంది ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నారు.
By: Tupaki Desk | 22 March 2024 6:31 AM GMTప్రపంచంలోనే అనేక జబ్బులకు చికిత్సలు రావడంతో చాలా మంది ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నారు. ప్రపంచంలో ముసలి వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. దీంతో ఆదాయం గణనీయంగా తగ్గిపోతోంది. వయసు మళ్లిన వారు పని చేయరు. కేవలం కూర్చుండి తినడానికి మాత్రమే పనికొస్తారు. దీంతో వారి మనుగడ అవసరం లేకపోయినా వారి సంఖ్య మాత్రం నానాటికి ఇనుమడిస్తోంది. ప్రపంచవ్యప్తంగా ముసలి వారి సంఖ్య పెరగడం ఆందళనకరమే.
పంజాబ్ లో సెంచరీ దాటిన వారి సంఖ్య పెరుగుతోంది. సుమారు 120 ఏళ్లు దాటిన వారు కూడా ఉన్నారు. వారంతా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉంటున్నారు. అక్కడ 120 ఏళ్లు దాటిన ఓటర్లు 205 మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి సిబిన్ ఈ విషయం ధ్రువీకరించారు. వారి ఓటును వినియోగించుకుంటామని చెప్పారు.
122 మంది పురుషులు, 83 మంది మహిళలు 120 ఏళ్లు దాటిన వారు ఉన్నారు. ఇంకా 100 నుంచి 119 ఏళ్ల మధ్య వయసున్న వారు 5004 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 1,976 మంది, మహిళలు 3,028 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా వయోభారం ఉన్న వారు అధికంగా ఉండటం అక్కడ ప్రత్యేకతగా చెబుతున్నారు. ఇంత లేటు వయసులో కూడా వారు ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇలా పంజాబ్ లో వయసు పైబడిన వారు అధికంగా ఉంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉంటోంది. ఈనేపథ్యంలో వారి మనుగడకు అధిక శ్రమ పడాల్సిందే. ఎందుకంటే వారు పని చేయలేరు. కూర్చుండి తినడమే వారు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారికి భక్తి కొంచెం కష్టమే. వారి సంతానం వారిని అంత ప్రేమగా చూసుకోరనే విషయం తెలిసిందే.
చైనాలో కూడా ముసలివారి సంఖ్య పెరుగుతోంది. వయసు మీద పడిన వారితో భారమే. కానీ మనం ఏం చేయలేం. వారి మనుగడకు వారే మార్గాలు ఎంచుకోవాల్సి ఉంటుంది. దీంతో ముసలి వారికి తిండి ప్రధానమే. సమయానికి తిండి లేకపోతే వారు జీవించడం కష్టమవుతుంది. అందుకే వారి వారసులే వారిని బాగా చూసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతోంది.