వైరల్ వీడియో: ముంబైలో టూరిస్ట్ పడవ - స్పీడ్ బోటు ఢీ... 13 మంది మృతి!
అవును... ముంబై తీరంలో దారుణం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. పర్యాటకులతో వెళ్తున్న పడవను ఇండియన్ నేవీకి చెందిన స్పీడ్ బోటు ఢీకొట్టింది.
By: Tupaki Desk | 18 Dec 2024 5:03 PM GMTమరికొన్ని రోజుల్లో 2024 ఏడాది పూర్తై.. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న తరుణంలో వరుస ప్రమాధాలు జరుగుతున్నాయనే చర్చ కొన్ని రోజులుగా తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ముంబై తీరంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు చెబుతున్నారు. ఈ మేరకు సీఎం కీలక విషయాలు వెల్లడించారు.
అవును... ముంబై తీరంలో దారుణం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. పర్యాటకులతో వెళ్తున్న పడవను ఇండియన్ నేవీకి చెందిన స్పీడ్ బోటు ఢీకొట్టింది. దీంతో... తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. సుమారు 101 మందిని కాపాడినట్లు తెలిపారు.
బుధవారం సాయంత్రం "గేట్ వే ఆఫ్ ఇండియా" నుంచి ఎలిఫెంటా గుహలకు వెళ్తున్న నీల్ కమల్ అనే ఫెర్రీ బయలుదేరింది. ఇందులో సుమారు 100 మందికి పైగా పర్యాటకులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో... వేగంగా వచ్చిన నేవీకి చెందిన స్పీడ్ బోటు దీన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో... నీల్ కమల్ ఫెర్రీ సముద్రంలో మునిగిపోయింది.
ఈ నేపథ్యంలో ఘటన గురించి తెలిసిన వెంటనే రెస్క్యూ బృందాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ఇందులో భాగంగా... 11 నేవీ పడవలు, తీర ప్రాంత దళాలకు చెందిన మూడు పడవలతో పాటు నాలుగు హెలీకాప్టర్లు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో 101 మందిని కాపాడాయి! 13 మంది మృతుల్లోనూ 10 మంది పర్యాటకులు కాగా, ముగ్గురు నేవీ సిబ్బంది అని అంటున్నారు.